Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

307


నర్సుగారు గొప్ప మహజరును తయారుచేయించి 1852 లోనే షార్లిమెంటుకు నివేదింపచేసిరి. నాటి కంపెనీ పరిపాలనమున ప్రజలు దరిద్రులై అజ్ఞానమున మునిగి అనారోగ్యమున పడి యుండుటయు, రాకపోకలకు పల్లఫుసాగుకు ఎట్టి సౌకర్యములు లేకుండుటయు, పన్నులత్యధికమై రైతులు భరింపలేకుండుటయు పన్నులివ్వలేనివారు బాధింపబడుచుండుటయు, కలెక్టరుల నిరంకుశత్వమును, అధికారుల లంచగొండితనమును, కోర్టుల యప్రయోజకత్వమును, క్రైస్తవమతబోధకుల దురాగతములును, కంపెనీవారి దుష్పరిపాలనయు ఆమహజరులో వివరముగావ్రాసి చిట్టచివర "దేశపరిపాలన మిప్పటివలెనే కంపెనీ చేతులలోనున్నను సరే, లేదా మరియొకరి చేతులలోనున్ననుసరే, పరిపాలనాపద్ధతిలో మాత్రము మార్పులును అభివృద్ధియు కలుగవలెను.” అని పార్లిమెంటువారిని ప్రార్థించిరి.

ఆకాలములో మన రాజధానిలో చెన్నపట్టణ స్వదేశసంఘము స్థాపింపబడి పనిచేయుచున్నట్లే కలకత్తాలో బ్రిటిష్ ఇండియ౯ అసోసియేషను అను సంఘమును బొంబాయిలోకూడా ఇంకొకసంఘమును స్థాపింపబడెను. వివిధ రాష్ట్రములనుండి పార్లిమెంటుకు మహజరు లంపబడినవి. చెన్నపటణమున లక్ష్మీనర్సుగారి వలెనే బొంబాయిలో దాదాభాయి నౌరోజీగారును దేశసేవచేయుచు నింగ్లండుకుపోయి భారతదేశ ప్రజలకష్టములను ఇంగ్లీషువారికి తెలుపసాగిరి.

పార్లిమెంటువారు 1853 లో కంపెనీవారికి క్రొత్తపట్టాను జారీచేయుచు ఒక చట్టమును చేసిరి. దానిలో పెద్ద సంస్కర