Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

9


గ్రామములపైన పై పెత్తనము కలిగియుండిరి. ఈ నాయకులపైన 'కార్యకర్త 'యను సామ్రాజ్యాధికారియే పై పెత్తనము వహించును. దక్షిణమున మధురలో మాత్రము ' పాళెగారు' లను సైనికనాయకులొక క్రొత్త పద్దతిస్వపరిపాలన స్థాపించిరి. 72 పాళెముల పాళెగార్లు సైనికాధికారులుగనుండి ' నేరగాండ్రను, కొండజాతులను, విదేశీయులను అదుపులో నుంచిరి. వారు దేశాదాయములో మూడింట రెండువంతులు తీసికొని మూడవవంతు నాయకులకు పంపుచుండిరి.

అక్బరునాటి మొగలుసామ్రాజ్య విభవము జగత్ప్రసిద్దము. ఈచక్రవర్తి ఎంతగొప్పరణశూరుడో అంతగొప్ప పరిపాలకుడు. అతనివిజ్ఞానసంపద, సర్వమతసహనము, ఔదార్యము, దాతృత్వము క్షమ, ధైర్యసాహసములు వర్ణనాతీతములు. అతడు న్యాయవిచారణలో అగ్నిప్రమాణ పరీక్ష మొదలగు క్రూరపద్దతులు, జంతువధ, బలి, యుక్తవయస్సురాక పూర్వము వివాహము జేయుటను సిషేధించెను. మహమ్మదీయులతో పాటు హిందువులకు సమానముగా నుద్యోగము లిచ్చెను. యాత్రీకుల పైన తలపన్ను తీసివేసెను. యుద్ధమునబట్టుకున్న వారిని బానిసలుగ జేయుపద్ధతి నిషేధించెను. షర్షాప్రారంభించిన ఆర్థికదవ్య సంస్కరణలు పూర్తిచేసెను. భూములనెల్ల కొలిపించి పంటలనుబట్టి తరములనిర్ణయించెను. ధాన్యపుశిస్తును రొఖ్కసిస్తుగా మార్చి రైతు కేది వీలుగనున్న ఆ ప్రకారము శిస్తుచెల్లింప వీలు కలుగజేసెను. బాధకరములగు అనేక పన్నులను రుసుములను తీసివేసెను. దీనివలన ప్రభుత్వమునకు ప్రజలు చెల్లించు