Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

305


ప్రచారముగావించిరి. ఇక గవర్నరన్ననో 12 వేల సంతకములతో పై సంగతులుగల ఆమహజరు తన దగ్గరకు రాగా అందలి సంగతులు అబద్దమని ఖండించలేక ఈ ప్రచారమెల్ల మిడిమిడి జ్ఞానముగలవారిచేత చేయబడుచున్నదనియు ప్రభుత్వమువారు తలపెట్టిన సత్కార్యములకు, చేసిన మంచి చర్యలకు, అపార్ధములు కల్పింపబడినవనియు, ప్రజలు ఇది మంచి ఇది చెడుగని తెలియని అజ్ఞానులనియు రిమార్కులు వ్రాసి సీమకంపగా కంపెనీ డెరక్టరులు ఆ మహజరును బుట్టదాఖలు చేసిరి. అయితే ఈ ఆందోళన ఫలితముగా పాఠశాలలయందు బైబిలు బోధించు తరగతి మాత్రము అప్పటికి నిలిపి వేయబడెను. 1853 లో మరల బైబిలుబోధను ప్రారంభించుటకు ప్రయత్నింపగా లక్ష్మీనర్సుగారును ఆయనకు ప్రథమము నుండియు ఈ ఆందోళనమున తోడ్పడుచు పుణ్యము గట్టుకొనుచున్న పరోపకార పారీణుడగు 'నార్టన్' దొరగారును ఈ ప్రయత్నమును విఫలము చేసిరి.

ఆ కాలముననే ఇంగ్లాండు పార్లమెంటుసభ్యుడగు డాంబే సేమర్ అను దొర భారతదేశస్థితిగతులను స్వయముగా చూచుటకువచ్చి లక్ష్మీనర్సుగారిపేరు వినియుండుటవలన ఆయనక్షేమ మడిగెను. అంతట లక్ష్మీనర్సుగా రాయన, కాతిథ్యమిచ్చి కడలూరు, కోయంబత్తూరు మొదలగు జిల్లాలకన్నింటికిని తీసికొని వెళ్లి పన్నులవసూళ్లలో జరుగుచుండిన దురాగతముల నాయనకు ప్రత్యక్షముగా చూపించెను. పన్నులివ్వలేని రైతులను రివిన్యూనౌఖరులు రెక్కలువిరిచి కట్టి కొట్టుచుండిరి. కొందరిని