304
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
యించబడెను. నాటిసభవారనేక తీర్మానములు గావించిరి. అన్నిమతములను సమానముగా చూతుమనియు క్రైస్తవమతమునకు ప్రత్యేక ప్రోత్సాహము నొసగమనియు కంపెనీ ప్రభుత్వము చేసిన వాగ్దానములకు విరుద్ధముగా పూర్వపు గవర్నరు ప్రవర్తించుట మతబోధకులు ప్రభుత్వమువారి ఉద్యోగుల సహాయముతో ప్రజలను తమమతములో కలుపుకొనుటకు నిర్బంధించుచుండుట, అందుకు ప్రభుత్వమువారు తోడ్పడుచుండుట, పాఠశాలలోని బాలురనుగూడ క్రైస్తవ మతమున జేర్చుచుండుట, హిందూబాలురుపరీక్షయం దుత్తీర్ణులు గాకుండగను వారి కుద్యోగములురాకుండగను మతబోధకులును వారి చేతిలోని ప్రభుత్వోద్యోగులునుకలిసి కుట్రలు చేయుచుండుట, చెన్నపురిరాజధానిలోని వివిధజిల్లాలలో ఇంగ్లీషు పాఠశాలలు, నెలకొల్పి జనసామాన్యమునకు ఇంగ్లీషువిద్య నేర్పకుండుట; న్యాయస్థానములందుగూడ తరచు అన్యాయములే జరుగుచుండుట; కంపెనీ పరిపాలనమందు ఇంక ననేక అన్యాయములు జరిగి ప్రజలు బాధపడుటయు నా సభవారు చక్కగా విమర్శించి ఈ అన్యాయములు తక్షణమే మాన్పవలెనని కోరిరి.
ఈ సభకు లక్ష్మీనర్సుగారే అధ్యక్షత వహించి సభను శాంతియుతముగాను జయప్రదముగాను నిర్వహించియుండిరి. భారతీయ ప్రజలుబాగుపడుటయు, అభివృద్ధి జెందుటయు సహించని స్వార్ధపరులగు దొరలు కొందరు, ఆ సభలో రాజద్రోహకరమైన ఉపన్యాసములు జరిగెననియు, సభలో కల్లోలము కలిగెననియు రసాభాసము జరిగి యది ముగిసెననియు అబద్దపు