దేశోద్ధరణ ప్రయత్నములు
303
మతబోధకుల ప్రోత్సాహముతో నా పాఠశాలలో పరీక్షచేయు దొరలు ఉద్యోగులుకలిసి ఒక తంత్రమును గావించిరి. అధికారులుచేయు పరీక్షల యం దుత్తీర్ణులైనగాని ఉద్యోగము లివ్వరు. పరీక్షలుచేయు అధికారులు దొరలు. వీరు పాఠ్య పుస్తకములలోని సంగతులనుగూర్చి మాత్రమేగాక ప్రపంచజ్ఞానమునుగూర్చి ప్రశ్నించునెపమున బాలకులను క్రైస్తవమత గ్రంథములలోని సంగతులనుగూర్చి యడుగుటయు వారు జవాబు చెప్పలేని వారు ప్రభుత్వోద్యోగములకు అనర్హులని నిర్నయించుటయు ప్రారంభించిరి. అందువలన బాలురెల్లరు బైబిలు చదువవలసి వచ్చుచుండెను. ఇది అన్యాయమని మొత్తుకొనిప్రభుత్వమునకుఅర్జీలు పెట్టుకొనగా, ప్రపంచ జ్ఞానమునకు సంబంధించిన ప్రశ్నలడుగుటలో తప్పులేదనియు పాఠశాలలందే బైబిలును చదివినచో నీచిక్కు ఉండదనియు ప్రభుత్వమువారు జవాబుచెప్పి ఆ ప్రకారము బైబిలును పాఠశాలలలో ప్రవేశపెట్టిరి! ఈ తంత్రము పన్నబడి మతప్రచారము పాఠశాలల యందు ప్రారంభమగుటచూచి లక్ష్మీనర్సుగారు దీనిని గూర్చి తీవ్రమైన ప్రచారము జేసి దీనితోపాటు దేశములో ప్రజలకు జరుగుచున్న ఇతర అన్యాయములనుగూర్చి యోజించి తగుచర్య జరుపుటకొరకు 1846 అక్టోబరు 7 వ తేదిన నొక గొప్ప సభను మదరాసులో సమావేశపరచిరి. అందులో దేశస్థితిగతులెల్ల విమర్శింపబడి పెక్కుతీర్మానములు గావింపబడెను. ఆతీర్మానముల ననుసరించి ఒక మహజరును తయారుచేసి ఇంగ్లాండులోని కంపెనీ డైరక్టర్లకు గవర్నరుద్వారా పంపుటకు నిశ్చ