302
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
తేదీన సమావేశపరచిరి. ఆ సభకు చెన్నపురిలోని హిందూప్రముఖులెల్లరు విచ్చేసి దానినిగూర్చి అసమ్మతి తీర్మానములను గావించిరి. ఆ తీర్మానముల ప్రకారము అసమ్మతిని సూచించుచు ఒక పెద్ద మహజరును గూడా తయారుచేయించి పెక్కుమందిచేత సంతకములు చేయించి లక్ష్మీనర్సుగారు తన ఖర్చుపైన దానిని ఇంగ్లండులోని కంపెనీ డైరెక్టర్ల కంపిరి. ఇంత ఆందోళనము జరుగగా ఆ చట్టమును అప్పుడు చేయుటకు ధైర్యముచాలక అప్పటికా ప్రయత్నమును కంపెనీ ప్రభుత్వము వారు విరమించిరి. గాని తరువాత నైదేండ్లకు 1850లో ప్రాత నిబంధనలతోనే ఇంకొక చట్టమును నిర్మించిరి. (Cast Disabilities Removal Act-1850) దీని ఫలితముగానే బందరులో మర్యాదగల నియోగి వైదిక మధ్య, కుటుంబములలోని కొందరు యువకులు క్రైస్తవులై నేటికిని ప్రాత యింటిపేర్లతోనుండుటయు తటస్థించినది. పాఠశాలలందలి యువకులెందరో ఆకాలమున క్రైస్తవులుగ చేయబడిరి. ఆనాడు 1845లో తమ ప్రయత్నములకు భంగము కలిగించెనని ఆంగ్లేయ మతాచార్యులకును వారి వశవర్తులగు కంపెనీ ఉద్యోగులకును లక్ష్మీనర్సుగారిపైన తీవ్రమైన క్రోధముకలిగి ఆయనకు నష్టముకలిగించుట కనేక దుష్ప్రయత్నములు జేసిరి.
ఇంతలో క్రైస్తవమతబోధకులు తమదృష్టిని పాఠశాలలవైపుకు మరలించిరి. అప్పటివరకు ప్రభుత్వపాఠశాలలయందు శాస్త్రవిజ్ఞానమును ఇంగ్లీషు భాషయుమాత్రమే బోధింపబడుచుండెను. గాని, ఎట్టిమత బోధయు చేయబడుటలేదు. ఇప్పుడుక్రైస్తవ