Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

297

క్రిస్టోదాస్‌పాలుయొక్క శక్తి సామర్థ్యముల వల్లనే బ్రిటిషు ఇండియ౯ అసోసియేషను దిన దిన ప్రవర్ధమాన మయ్యెను. మొదట నతడు దానికి సహాయ కార్యదర్శిగానుండి దేశోద్ధరణ ప్రయత్నములందు గొప్ప సేవజేసి హరిశ్చంద్ర ముఖర్జీగారు చనిపోయిన తరువాత 1879 లో కార్యదర్శియై దీనిని మద్రాసు స్వదేశసంఘము, బొంబాయి సంఘములతో పాటు సక్రమముగా నడిపి భారతజాతీయచైతన్యమునకు తోడ్పడునట్లు గావించిన దీ ప్రతిభాశాలియె. 1861 లో దేవేంద్రనాధ టాగూరు కేశవచంద్రసేనులు స్థాపించిన 'ఇండియ౯ మిర్రరు' తరువాత స్థాపింపబడిన అమృతబజారుపత్రికలు క్రమక్రమముగా దేశమునందు ప్రజాభిప్రాయము కలిగింపసాగెను.

1851 ఆ ప్రాంతములలోనే బొంబాయిలో ఆనాటిప్రముఖులగు జగన్నాధ్ శంకరసేట్ గారును మరికొందరును కలసి ఒక ప్రజాసంఘమును స్థాపించి దేశోద్ధరణకొరకు పాటుపడసాగిరి. ఈ సేటుగారు 1863 లో బొంబాయి శాసనసభలో మెంబరయి భారతదేశ జాతీయోద్యమ పితామహుడగు దాదాభాయి నౌరోజిగారితో కలిసి దేశముకొర కెంతో పాటుపడెను. దాదాభాయి నౌరోజిగారు గొప్ప దేశభక్తుడు. ఈయన 1825 లో జన్మించి విద్యాభ్యాసమైనపిదప పారశీ పాఠశాలోపాధ్యాయుడై పారశీసంఘమందు పనిచేసి తరువాత బొంబాయి ప్రజాసంఘమునకు తోడ్పడెను. ఈయన వ్యాపారము కొరకు 1855 లో నింగ్లాండుకువెళ్ళి అక్కడనే యుండి భారతదేశమున కప్పుడప్పుడు వచ్చుచు నీ దేశోద్ధరణకొరకు