పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

భారత దేశమున


జరుపబడుచుండెను. సామ్రాజ్యముయొక్క కేంద్రపరిపాలన చక్రవర్తి స్వయముగానే జరుపును. ఇరువదిమంది మంత్రులు, 9 మంది ముఖ్యదండనాధులు, పదునొకండుమంది సామంతులు నుండిరి. యుద్ధమంత్రి, న్యాయపరిపాలన మంత్రి, కోశమంత్రి మున్నగువారి క్రింద వివిధశాఖల కార్యదర్శులు నేటి డిపార్టుమెంటల్ శెక్రటరీలవలే నుండిరి. ఈ ప్రభుత్వము రాష్ట్రీయ మండలాధిపతుల పరిపాలనను కని పెట్టి చూచుచుండెను. 200 మంది సామంతమండలేశ్వరులు చక్రవర్తికి కప్పములు కట్టుచుండిరి. గవర్నరులవంటి మండలేశ్వరులకు సాలుకు 3 లక్షలు ఆదాయమునుండి 15 వేలవరకు ఆయాపదవియొక్క గౌరవమును బట్టియుండెను.

స్థానికపరిపాలన కేవలము గ్రామపంచాయతులద్వారా జరుగుచుండెను. 1565 నాటికీ సామ్రాజ్యమున 12600 గామములుండెనని శిలాశాసనములవలన తెలియుచున్నది. ప్రతిగ్రామము యొక్క భూస్వామిత్వపద్ధతి ఆ గ్రామసంఘముయొక్క అధికారముక్రిందనే యుండెను. గ్రామ సంఘముసకు సభ్యులు అధికారులు వేరుగానుండిరి. ఈ గామసంఘముల వారే భూవిషయిక వివాదలను పరిష్కరించుచుండిరి. దుర్మార్గములు చేసిన ఉద్యోగుల భూములు వశముచేసికొనుచుండిరి. గ్రామోద్యోగుల తగాదాలు పరిష్కంచుచుండిరి. పల్లపునీటి సాగుకు, నీటివనరులకు రోడ్లకు కట్టడములకు ప్రత్యేకోద్యోగులుండిరి. గ్రామోద్యోగులపైన 'పారుపత్యగారు' లనబడు అధికారులు నాడులనాయకుల అధికారము క్రిందనుండి