290
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
హంటరు, ఆర్. టి. రీడ్ మున్నగువారును నిష్పక్షపాతముగానే మాటలాడుచుండిరి. డల్‌హౌసీప్రభువుగూడ నిష్పక్షపాతిగనే యుండెను. 1868 లో సభ్యుడుగా నుండిన ఫాసెట్‌గారు గూడా భారతదేశమం దభిమానముగల్గి పనిచేసిరి. 1853 లో మద్రాసుకు వచ్చి రైతుల దురవస్థలు స్వయముగా చూచి వారిని పెట్టుచున్న హింసలు పార్లమెంటుకు చెప్పిన 'డాంబే సేమరు'ను, 1890లో నీ దేశమునకు హోమురూలు నివ్వవలసిన దనుబిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ఛార్లెస్ బ్రాడ్‌లా' గారును, తరువాత నీ దేశ కష్టసుఖములను విచారించి వీనిని గూర్చి ఎంతో పని జేసిన టారెన్సు, కేర్‌హర్డీ మున్నగునాంగ్లేయ ప్రముఖులును, ఈ దేశము తరఫున చాల పనిజేసిరి.
ఇక ఇంగ్లాండునుండి భారతదేశమున కుద్యోగము చేయవచ్చిన ఆంగ్లేయులలోను ఈ దేశమునం దితరవృత్తులు చేసి పోవు ఆంగ్లేయులలోను ఈ దేశప్రజల బాధలను జూచి హృదయములు కరగి ఈ ప్రజల బాధల మాన్పుటకును, వీరికి విద్యాభివృద్ధిచేసి ఉద్దరించుటకును వీరిలో, జాతీయ చైతన్యము కలిగించుటకును తోడ్పడిన పరోపకార పారీణులగు నాంగ్లేయు లనేకులుండిరి. వారిలో సర్ థామస్ మన్రో, వాకర్ ,ఎల్ ఫిన్ స్ట౯ మున్నగు ఉద్యోగులును డేవిడ్ హేర్ , జాక్ బ్రూస్ నార్ట౯ మున్నగు ఉద్యో గేతరులును మన దేశోద్ధరణకు తోడ్పడిన మహానుభావులు. తరువాతభారతజాతీయ కాంగ్రెసుమహాసభను స్థాపించుటకు మూలపురుషుడైన ఎ. ఓ. హ్యూముదొరగారు కూడ మనదేశమున పనిచేయవచ్చిన ఐ.సి.ఎస్. ఉద్యోగియే. ఇట్లే సర్