Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

ఇట్టిస్థితిలో భారతీయులు తృప్తి జెందియున్నారా ? నిజముగా వా రీదుస్థితి నంగీకరించి యూరకొనలేదు. వారు తమ అసమ్మతి తెలిపి తిరుగబడక పోవుటకు కారణమేమనగా వారి నణచియుంచిన యీ బ్రిటిషు ప్రభుత్వ మతిబలవంతమైనది. ప్రజాభిప్రాయము లేవకుండ అణచివేయగల బందోబస్తులుగలట్టిదిగ నున్నది. ఇప్పుడు మరల నీకంపెనీ పరిపాలనకు పట్టానిచ్చు తరుణమువచ్చినది. గనుక భారతీయులు మొరబెట్టుకొనుచు పార్ల మెంటుకు మహజరు లంపినారు. 1833 వ సంవత్సరపు ప్రభుత్వపద్ధతిని భారతీయులు హర్షించి రనుట విపరీతము.

ఈ విధానము వలన తమ ప్రజాసంఘమే పెల్లగింపబడి పాడై పోయినదని మద్రాసు ప్రజలు మొఱబెట్టుకొనుచున్నారు. రుచిలేని గంజిమెతుకుల కవసరమైన ఉప్పుకల్లు, మానవులకు పశువులకుగూడ అవసరమైన వస్తువు, ప్రభుత్వము వారి యిజారాగా చేయబడుట యన్యాయమని మొరబెట్టుచున్నారు. పట్టణములలో బజారులలోని అంగడులపైననేగాక బాటల ప్రక్కల పందిళ్లలోను పంచలలోను పెట్టుకొనిన చిన్నదుకాణములపైన తాము జీవనముకొర కుపయోగించు ప్రతిపనిముట్టు పైనను తుదకు చూరకత్తులపైనను గూడా దానిఖరీదుకన్న ఆరురెట్లు మొత్తము మోతర్ఫా పన్నువిధింపబడుచుండుటను గూర్చి ఘోషించుచున్నారు.[1]

  1. .ఇది గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు, జాన్ బ్రూస్ నార్టన్ గారూ చెన్నపట్టణ స్వదేశసంఘము ద్వారా చేసిన ఆందోళనను గూర్చిన ఉల్లేఖనము.