పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


స్వల్పము. పార్లమెంటుకు నివేదించుటకుకూడ తగనంత హీనముగ నున్నందున లెక్కలలో నిది కనబరుపబడుటయే లేదు. ఒక్క సంగతిమాత్రము స్పష్టము. హిందూరాజ్య కాలమున ప్రతి గ్రామములోను నొక పాఠశాల యుండగా భారతదేశ గ్రామసంఘములను ప్రజాసంస్థలను మనము నాశనము జేయుటవలన నీపాఠశాలలును పోయినవి. వానికిబదులు మనమెట్టి విద్యావిధానమును స్థాపింపలేదు. మద్రాసులో 2 కోట్ల 20 లక్షల ప్రజలలో సాలుకు 160 మందికిమాత్రమే ఆంగ్లేయ ప్రభుత్వము విద్యాదానము చేయుచున్నది. వంగరాష్ట్రములోని ధైర్యశాలురు కొందరు ఇంగ్లాండుకువచ్చి చదువుకొని వెళ్ళగా వారి నాంగ్లేయులతో సమానముగా నుద్యోగములిచ్చి ఆదరింపరైరి. ఇంగ్లాండు కట్లు వచ్చి 5 సంవత్సరములు చదివి సువర్ణ పతకము బహుమానమంది ఎం. డి. పట్టమునందిన చక్రవర్తియను భారతీయవైద్యునికి కంపెనీ డైరెక్టర్లు సైనిక వైద్యశాఖలో నుద్యోగ మీయరైరి. భారతీయులకు పెద్ద యుద్యోగము లీయకపోవుట యనునది చాల అన్యాయమైన రూపము దాల్చినది.

ఆంగ్లేయ ప్రభుత్వము యొక్క ప్రారంభ దినములలో భారతీయులకు సైన్యమునగూడ ఉద్యోగములివ్వబడుచుండెను. వారు సమర్థతతో పనిచేయుచుండిరి. అనేక చోట్ల నేటివు. ఏజెంట్లు, ప్రతినిధులు నుండిరి. అప్పుడు నేటివుల నుపయోగింప వలసిన అవసరముండెను. జీతములుగూడా మితముగానుండెను క్రమక్రమముగా భారతీయులను త్రోసిరాజనిరి. గొప్ప