పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


పదియవ ప్రకరణము

కంపెనీ పరిపాలన యొక్క ఫలితములు

భారతదేశ రాజకీయములను సంస్కరించు నుద్దేశముతో “ఇండియా రిఫారం సొసైటీ" అనబడు సంఘమొకటి ఇంగ్లాండులో 12-3-1853 తేదీన స్థాపింపబడెను. ఆ సంఘవా రీ దేశపరిస్థితులనెల్ల చక్కగా విచారించి తెలుసుకొని ఆంగ్లప్రజలకు తెలియపరచుట కప్పుడప్పుడు కొన్ని కరపత్రములు ప్రకటింపసాగిరి. అట్టి కరపత్రములలో మొదటిది 1834 సంవత్సరము నుండి 1853 వరకు జరిగిన భారతదేశ పరిపాలనను గూర్చినది. 1853 లో మరల తూర్పుఇండియా కంపెనీవారికి పట్టానివ్వవలసివచ్చు తరుణము వచ్చెను. దానిలో నంతవరకు నీ కంపెనీ పరిపాలన మెట్లుజరిగెనను సంగతిని గూర్చి వారు చక్కగా వివరించిరి.

"దేశశాంతి:- 1833 వ సంవత్సరములో కంపెనీవారి కివ్వబడిన పట్టాననుసరించి స్థాపింపబడిన ప్రభుత్వమున గతించిన 19 సంవత్సరములలో 15 సంవత్సరములు యుద్ధములోనే గతించినవి. ఈ యుద్ధములు భారతదేశ రక్షణకొర కవసరమైనవికావు సరికదా వీనివలన నా దేశప్రజల శాంతికిని సౌఖ్యమునకును భంగముకలిగెను. భారతదేశ ప్రభుత్వముయొక్క . ఆదాయముల నివి వృధాగా వ్యయపరచెనుగాని ఈ యుద్ధములు 1833 లో స్థాపింపబడిన విధానముయొక్క సహజ పరిణామములే. ఇట్టి యుద్ధములందు నిమగ్నమైన ప్రభుత్వము ప్రజా