ఇంగ్లీషు చదువులు
277
యింపించుట, ఇంగ్లీషు బోధించు క్రొత్త పాఠశాలలను నిర్మించుట, ప్రజలనితర విధములుగ పోత్సహించుట అవసరమనియు ఈ కార్యములకగు వ్యయములన్నియు గ్రామవాసులే భరింపగలరనియు దొరతనమువారు సొమ్ము ఖర్చుపెట్ట నక్కరలేదనియు కూడ చెప్పిచూచెను. కాని ఈతడుపదవి మానుకొనువరకును ఈ ప్రణాళికకు అనుజ్ఞ రాలేదు. బొంబాయిలో ప్రథమ ఇంగ్లీషు పాఠశాల 1828 లో స్థాపింపబడెను. పూనా సంస్కృతకాలేజికి ఒక ఇంగ్లీషు శాఖ జేర్చబడెను. బొంబాయిలోని ఎల్ ఫిన్ స్టన్ కాలేజి 1834లో గాని స్థాపింపబడలేదు. కలకత్తాలో రామమోహనరాయి, డేవిడ్ హేర్ మున్నగువారి కృషివలన 1817లో హిందూ కాలేజీ స్థాపింపబడెను. ఆంగ్లవిద్య నేర్పవలెనా సంస్కృతవిద్య నేర్చవలెనా యనువివాద మొకటిరాగా మెకాలే సలహాతో బెంటింకు ప్రభువు ఆంగ్ల విద్యాపద్ధతినే స్థాపించెను. ఎల్ ఫిన్ స్టస్ బెంటింకు లెంతసద్బుద్ధితో నాంగ్లవిద్యాభి వృద్ధి కొఱకు ప్రయత్నించినను ఆంగ్లవిద్యావిధానమును నెలకొల్పుటలో బ్రిటిషు రాజ్యతంత్రజ్ఞుల యొక్క నిజోద్దేశము భారతీయులకు విజ్ఞాన వికాసములు కలిగింపవలెనని కాదు; కేవలము బ్రిటిషు పరిపాలనకు అనుకూలములగు పరిస్థితులు కలిగించుట, బ్రిటిషువారిను నాగరకత వారి పద్ధతులను భారతీయు లర్ధము చేసికొని వారి పట్ల గౌరవ భావము స్నేహభావము కలిగించుట కేయని కంపెనీ ప్రభుత్వమున అనేక గొప్ప యుద్యోగములు చేసి మద్రాసు గవర్నరైన సర్ చార్లెస్ ట్రెవిలియన్ గారు తనపుస్తకములో స్పష్టముగా చెప్పియున్నారు. పూర్వము