Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

భారత దేశమున

17 వ శతాబ్దములో టెవర్నియరు. భారతదేశమంతట తిరిగి చూచి చాలకుగ్రామములందు సైతము ధాన్యములు, పిండి, వెన్న, పాలు, చిక్కుడుకాయలు, ఇతర కూరగాయలు, పంచదార, ఇతరమిఠాయిలు పుష్కలముగా దొరుకుచుండెనని వ్రాసినాడు . దీనివలన రైతులస్థితి యెంతబాగుండెనో గ్రామజీవన మెంత సుభిక్షముగా నుండెనో తెలియగలదు.

కృష్ణ దేవరాయలసామ్రాజ్యము కన్యాకుమారియగ్రము మొదలు కృష్ణా తుంగభద్రానదులవరకు . వ్యాపించెను. వారి పలుకుబడి తూర్పున కటకమువరకు పడమర సాల్సెటి వరకు నుండెను. ఈ విజయనగర సామాజ్యము పోర్చుగీసు వర్తకము వలన చాల లాభము పొందెను. పన్ను లేకుండా వర్తకముచేసికొనుటకును, కోటయొకటి కట్టుకొనుటకును పోర్చు గీసు వారికి కృష్ణ దేవరాయ లనుజ్ఞ నిచ్చెను. ఆ కాలమున విజయనగరము ప్రపంచములోని నౌకావాణిజ్యము చేయు వివిధ జాతులవారితో నిండి ఒక అంతర్జాతీయ పట్టణమువలె నుండెను. ఈజిప్టు పారశీకము మొదలగుతురుష్క దేశ రాజులతో వర్తక సంబంధముండెను. సమస్త సరకులలోను విదేశీయవ్యాపారము జరుగుచుండెను. ఏనుగుల గుర్రముల వ్యాపారమును పోర్చుగీసువర్తకులు విరివిగా జరుపుచుండిరి. ఆసామ్రాజ్యమున 300 రేవుపట్టణములుండెను. విజయనగరమున ఒక్కొక్క సరకు కొక్కొక బజారుండెను. పుష్పముల రాసులు రత్న రాసులు గల అంగళ్ళుండెను. ఆనగరములో చిత్రలేఖనము, శిల్పము, లోహ కళలు, శిలానిర్మాణములు, చెక్కడము, దంతపుబనులు,