పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు చదువులు

275


నియమించుటకు నిశ్చయించెను. దేశప్రజల ఆచార వ్యవహారములను, శాస్త్రధర్మములను క్రోడీకరింపజేసెను.

తొమ్మిదవ ప్రకరణము

ఇంగ్లీషు చదువులు

బ్రిటిషు ప్రభుత్వము స్థాపించబడునాటికి ప్రతిరాష్ట్రములోను ప్రజలు కొంచెముగనో గొప్పగనో విద్యనేర్చి యుండిరి. గ్రామపంచాయితీలు, గ్రామపాఠశాలలు మంచిస్థితిలో నుండెనుగాని ఒక్కొకరాష్ట్ర మాంగ్లేయుల వశమగు చుండగా నచ్చటి గ్రామపంచాయితీలు పాఠశాలలు దుస్థితిలోపడి నాశనమైపోవుచుండెను. కంపెనీవారు ప్రాతసంస్థల నుద్దరింపక ఆంగ్ల పాఠశాలలను స్థాపింపక ఉపేక్షించుచుండిరి. అందువలన ప్రజలు అజ్ఞానాంధకారమున మునుగసాగిరి. ఆంగ్లేయ కంపెనీ కవిలెలందలి సంగతుల వలననే కంపెనీకి పూర్వమునాటి విద్యాభివృద్ధి చక్కగ నుండెనని తెలియుచున్నది. 1822-26 మధ్య మద్రాసు రాజధానిలో జరిగిన విచారణవలన నానాటికి పాఠశాలకు బోవు బాలురసంఖ్యలో దరిదాపు ఆరవవంతు మంది ఏదోవిధమగు విద్య నేర్చియుండిరని తెలిసినది. ఇట్లే బొంబాయిలో 1823-28 మధ్యజరిగిన విచారణవలన ఎనిమిదిమందిబాలురలో నొకడు విద్య నేర్చినట్లు తెలిసినది. వంగరాష్ట్రమున పురుషులలో నైదవవంతు చదువగల వారని నిర్ణయింపబడినది. 1835 నాటికి వంగరాష్ట్రమున ఒక లక్ష గ్రామపాఠశాల లుండెను. మన్రోగారి కాలము నాటికి