పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


గ్రామములకు నేటి దుర్గతి పట్టియుండదు. తరువాత చాలా ఏండ్లకు తాలూకా జల్లాబోర్డులు, యూనియనులు, స్థాపింపబడినను గ్రామములకు ప్రభుత్వముతో అన్యోన్యసంబంధ మేర్పడలేదు. కలెక్టర్లకు సర్వాధికారము లిచ్చుటవలన నేరము మోపువాడు, విచారించువాడు నొక్కడేయై ప్రజలకు న్యాయ విచారణమందు విశ్వాసము కుదురలేదు. పోలీసు మేజస్ట్రీటు అధికారము లొక్కఅధికారిలోనే కేంద్రీకరింపబడుట చాలా అన్యాయములకు గారణములయ్యెను.

వంగరాష్ట్రమున 1757 లో ప్లాసీయుద్దముకాగానే ఆంగ్లేయులకు రాజ్యాధిపత్యములభించినది. మద్రాసులో వందవాసియుద్దము జరుగగానే 1761 లో నది లభించినది. ఉత్తర సర్కారులు నైజామువలన వీరికి వచ్చివేసినవి; గాని బొంబాయిలో తరువాత నేబదేండ్లవరకు మహారాష్ట్రులు ఆంగ్లేయులతో పోరాడుచు వారికి రాజ్యాధిపత్యము కలుగనివ్వలేదు. ఎన్నోయుద్ధములు జరిగినపిదప 1802 లో నొక కీలుబొమ్మ పీష్వాగా చేయబడి 1817 లో బొంబాయి రాజధాని యాంగ్లేయులచే కలుపుకొనబడెను. బొంబాయి చరిత్రకెల్ల మూల పురుషుడు , మౌంటుస్టూవార్టు ఎల్ ఫి౯స్ట౯ అని చెప్పవచ్చును. 1818 జనవరిలో నితడు డక్కను కమీషనరుగా నియమింపబడి 1819 లో బొంబాయికి గవర్నరయ్యెను. మద్రాసు రాజధానిలో మన్రోవలెనే ఇతడును బొంబాయిలో రాజకీయ న్యాయవిచారణశాఖను పరిపాలనను సంస్కరించుటకు పూనుకొనెను. పరిపాలనశాఖలలోని ఉద్యోగములందు దేశీయులను