సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ
273
“ఇంగ్లీష్‌రూల్ అండ్ నేటివు ఒపినీయన్ ఇన్ ఇండియా" అను గ్రంథమున జేమ్సు రౌట్‌లెడ్జి, చెప్పినాడు. చెరసాలలందు వంగరాష్ట్రమున ఖైదీలచేత జనపనార పరిశ్రమలలో నీసమయమున నతికఠినముగా పనిచేయించినట్లును తేలుచున్నదని రెజినాల్డు రేనాల్డ్సు 1938 మేనెల 'న్యూలీడరు'లో వ్రాసినాడు.
V
న్యాయపరిపాలన, రివిన్యూ పరిపాలన, పోలీసు, గ్రామపంచాయతీల సంస్కరణమును గూర్చి 1814 లో మన్రోగారు చేసిన సూచనల విషయమున మద్రాసుప్రభుత్వమునకును కంపెనీ డైరెక్టర్లకును ఉత్తర ప్రత్యుత్తరములు జరిగిన పిదప పై వ్యవహారములలో కొన్నిటిని గూర్చినట్టియు, జిల్లా గ్రామాధికారుల కర్తవ్యములను గూర్చనట్టియు, వివిధనిబంధనలుగల 15 రెగ్యులేషనులు (శాసనములు) చేయబడెను. దీని ఫలితముగా మద్రాసు రాజధానిలో భారతీయులకు కొన్ని పెద్దయుద్యోగము లివ్వబడుటయు, న్యాయవిచారణాధికారములుగూడ ఒసగబడుటయు జరిగినది. గాని మన్రోగారు సూచించినట్లు గ్రామపోలీసు అధికారములు గ్రామోద్యోగుల కొసగబడక ప్రజలకు బాధ్యతలేని నిరంకుశపు పోలీసుసిబ్బంది యొకటి నిర్మింపబడినది. ఈపోలీసుశాఖ యనునది ఇతరదేశములందువలె ప్రజాసంరక్షణకొరకు గాక దొరతనమువారి అధికారము నిలువబెట్టుట కే ఉపయోగపడుచున్నది. మన్రోగారు సూచించిన ప్రకారము గ్రామ పంచాయితీలు పునర్నిర్మాణము గావింపబడలేదు. అది జరిగి యుండినచో