272
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
ఈ శిక్షాస్మృతి భారతీయుల నధోగతిలోనికి దింపినది. అధికారులు తలచు కొన్నచో దీనిక్రింద నేరము కానిదే లేదు. వారికిష్టమున్నచో నిజమైన నేరగాండ్రనుగూడ వదలుటకు వీలులేని నేరమునులేదు. ఇట్టి విధముగా నేరవివరణములు చేయబడినవి. ఐర్లాండుదేశ ప్రజల స్వాతంత్ర్యమును. హరించి వారి నణచి పీడించుట కా దేశమున నాంగ్లేయు లెట్టి శిక్షాస్మృతిని నిర్మించిరో ఈ దేశమునగూడఅట్లేచేసిరి. దానివలన ప్రజలధోగతికిదిగి దరిద్రులై దుర్మార్గులగుటకు కారణమైనది. ఇక శిక్షల జూతుమా, ఇంతకఠినశిక్షలు ప్రపంచములో నెక్కడను కని విని యెరుగము. ఒకమారు చెరకంపబడిన వా డెల్లకాలము ఖైదీగా నుండునట్లిందలివిధులు నిర్మింపబడినవే గాని సంస్కరణ విధాన మిందులేదు. ఖైదీలనెల్లరను సంఘమునుండిబహిష్కరించు విపరీతపుకట్టుబాటు లిందు చేయబడినవి. ఇక విచారణ విధానమునందు భారతీయుల కొక విధియు ఆంగ్లేయుల కింకొక విధియు నిర్మింపడుటయు, నేరము మోపువాడు విచారించువాడునొకడే యగుటయు, ఉన్నత మేజస్ట్రీటులు జడ్జీలు నాంగ్లేయులగుటయు భారతదేశ న్యాయవిచారణ విధానము నొక నిరంకుశయంత్రముగా జేసినవి.
భారతదేశ న్యాయపరిపాలననుగూర్చి 1878 లో విమర్శించుచు సర్ జార్జి క్యాంబెల్ గారు భారతదేశ కారాగారము లందలి మరణముల రేటు హెచ్చుగానుండుట వలన నేరగాండ్రు , తాము చెరకేగినపుడు బయటకువచ్చుట దుర్లభమని ఎరిగి నేరములు జేయకుందురని తన మినిట్సులో వ్రాసినట్లు