పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వలసివచ్చుచుండెను. సాక్షిగా పోవుటయన్న ఎంతోపాపము చేసుకొనుటయని హిందూమహమ్మదీయ ప్రజల కెల్లరకు తోచుచుండెను. కోర్టుఖర్చులు, రుసుములు అత్యధికముగా నుండి న్యాయవిచారణ అమితధనవ్యయ కారణమయ్యెను. పని తగ్గించుటకు న్యాయాధికారుల విచారణాధికారము హెచ్చు చేయబడి అప్పీళ్ళుచేసుకొను అవకాశము తగ్గింపబడెను. ఎన్ని నిర్బంధములనైనను నిరోధములనైనను చేసిరి గాని భారతీయులకుమాత్రము న్యాయవిచారణాధికారము నొసగరైరి. ఇంగ్లీషువారు రాకపూర్వ మీ దేశములో తరతరములనుండి తగవులుదిద్ద నేర్పరులైన భారతీయులు బ్రిటిషువారికాలములో పనికిరాకపోయిరి. తామీదేశములో అడుగిడునప్పటికి ప్రభుత్వము చేయుచున్న మొగలాయిరాజుల కాలమున అయిదు వందలయేండ్లు ఈ భారతీయులు గొప్పగొప్ప ఉద్యోగములు పొంది వానిని చక్కగా నిర్వహించుచుండిరను మాట నీ ఇంగ్లీషుదొరలు మరచిరి.

నేరములను విచారించి శిక్షించు క్రిమినల్ న్యాయవిచారణ పద్దతిలోకూడ చాల లోపములుండెను. వంగరాష్ట్రమునిండా బందిపోటుదొంగలు విచ్చలవిడిగా తిరుగుచుండిరి. దీనినణచుటకు మేజస్ట్రీటులకు సహాయము చేయగలందులకు నియమింపబడిన పోలీసు సిబ్బందియొక్క. జీతములు చాలతక్కువగానుండి వారిలో లంచగొండితనము మితిమీరినది. అందువలన పెక్కు నేరములు ఆచోకీతీయకుండ పోవుచుండెను. దీనినణచుటకు ఈ మేజస్ట్రీటులకు సహా