పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


శాస్త్ర మింకను అమలుజరుపబడినను 'రెగ్యులేషనుల' ద్వారా వానిలో కొన్నిమార్పులు చేసెను. వానిలో ముఖ్యముగా “కాఫరు'ల సాక్ష్యముపైన తురకలకు మరణదండన విధింపరాదను పూర్వపు నియమమును మార్చివేసెను.

వారన్ హేస్టింగ్సు స్థాపించిన సివిలు విచారణ పద్దతులందుకూడా కొన్ని మార్పులు చేయబడెను. జిల్లా కోర్టుల యందు పరివేష్టించు కలెక్టర్లకు ధర్మశాస్త్రము తెలియదు; పనియందు ఆసక్తియులేదు. మరియు వారు తమ అధికారములను తమ రివిన్యూ వసూలుకొరకు స్వంత వ్యాపార లాభముకొరకు వినియోగించుచుండిరి. కారన్ వాలిసు సివిలు న్యాయపరిపాలనను చౌకగను సులభసాధ్యముగను చేయదలచెను. అందువలన 1793లో కొన్ని రెగ్యులేషన్లు చేసెను. జిల్లాలలో 28మంది ఆంగ్లేయ జడ్జీలను నియమించి నాలుగు సర్క్యూటు అప్పీలుకోర్టులను పెద్దవిచేసి వానికి సివిలు విచారణాధికారమిచ్చెను. వీనిక్రింద భారతీయ సదరమీనులు కమిషనర్లు చిన్న సివిలు కేసులను విచారించుచుండిరి. ఆంగ్లజడ్జీలకు రివిన్యూ అధికారముతో సంబంధములేదు. ఇతడు అప్పు డమలులోనున్న శాస్త్ర ధర్మముల నెల్ల క్రోడీకరించి రిగ్యులేషన్లు చేయ ప్రయత్నించెను. దీనిలో నితనికి సర్ విలియంజోన్సు అను విద్వాంసుడు చాల తోడ్పడెను. కారన్ వాలిస్ చేసిన సంస్కరణములవలన వ్యాజ్యముల పిచ్చ ప్రజలలో ప్రజ్వలించెను. అంతట డిపాజిటురుసుము గ్రహించు ప్రాతపద్ధతి మరల అమలులోపెట్టగా నిది కొంత తగ్గినది. 1802 నాటికి ఆంగ్లేయజడ్జీలు 8298 కేసులు విచారింపగా