సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ
263
పార్టీలలో ఎవరికోఒకరికి కంపెనీ రివిన్యూ వసూలతో సంబంధమున్నదనియో లేక ఇంకొక మిషపైననో వారిపైన అధికారమును వహించి ఆంగ్లధర్మమును అమలు జరుపసాగిరి. వారన్ హేస్టింగ్సు హయాములో కలకత్తాకు బయటనుండు క్రిమినలు కోర్టులలో న్యాయవిచారణ మహమ్మదీయ అధికారులవలననే చేయబడుచుండెను. అందు అమలు జరుపబడునది ముసల్మాను ధర్మశాస్త్రమే. కోర్టులలో నుపయోగింపబడు భాష ఫారసీభాష. విధింపబడు శిక్షలలో తూర్పుదేశములందు సర్వసామాన్యశిక్షలగు చేతులు కాళ్లు ఖండించుట వాతలు వేయుటయుకూడ ఉండెను. ఆంగ్లేయకలెక్టర్లు 'కమిటింగు మేజస్ట్రీటులు' అనగా నేరములను విచారణకొరకు పంపు అధికారులుగా నుండిరి.
II
కారన్ వాలిసు 1787 లో కలెక్టర్ల కే చిన్న నేరములను విచారించు అధికార మిచ్చెను. 15 బెత్తము దెబ్బలు విధించుటకు వీరికధికారమిచ్చెను. 1790లో నితడు క్రొత్తనిబంధనలనుచేయగా వానిప్రకారము ప్రాతకోర్టులు తీసివేయబడెను. వానికిబదులు నాలుగు సర్క్యూటుకోర్టులు నెలకొల్పబడెను. ప్రతికోర్టుకును ఇద్దరు ఆంగ్లేయ జడ్జీలు నియమింపబడిరి. దీనివల్ల కంపెనీవారు వంగరాష్ట్రమున నేరవిచారణాధికారము వహించిరి. 1793లో నితడు పాట్నా డెక్కా మూర్షిదాబాదు కలకత్తాలలో ముగ్గురు జడ్జీలుగల అప్పీలుకోర్టులు స్థాపించెను. వీరు సర్కీటుకూడ చేయుచుండిరి. ప్రాతమహమ్మదీయ ధర్మ