పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


అమలులోనుండిన దాని నట్లేయుంచినాడు. రెగ్యులేటింగుఆక్టు అమలులోనికి వచ్చిన పిదప సుప్రీముకోర్టు ఆంగ్లేయ ధర్మమును అమలు జరుపసాగెను. వంగరాష్ట్రమునం దన్నిప్రక్కల నుండిన జమీందారులపైనను అధికారము చలాయింపసాగెను. ఈ జడ్జీల తెలివితక్కువతనమును చూచి కొంతమంది భారతీయులు చిక్కులు తెచ్చిపెట్టి లాభము పొందసాగిరి. గొప్ప గొప్ప భారతీయులుకూడా అనుమానముపైన ఆకస్మికముగా పట్టుకొనబడి కలకత్తాలో సామాన్యఖైదీలుంచబడు చెరసాల లందుబంధింపబడుచుండిరి. ఈ సుప్రీము కోర్టు పద్దతు లానాటి నేటివుల కగమ్యగోచరముగనుండెను. " హేబియస్ కార్పస్” అనగానేమో 'డామేజస్' అనగానేమో 'వారంట్' అనగానేమో వారెరుగరు. నేటీవులకు సమను లంపునప్పుడు వారు కోర్టు అధికారమునకు లోబడినవారే యని ఒక ప్రమాణపత్రము దాఖలుచేయలేనని జాగ్రత్తకొరకు ఒక నియమమును వారన్ హేస్టింగ్సు చేయించినను లాభము లేక పోయెను. ప్రతికేసులోను ఇట్టి ప్రమాణపత్రము దాఖలుచేయబడుచుండెను. జమీందారులను ప్రభుత్వాధికారముగల చిన్న సంస్థానాధీశులను గూడ కోర్టుకు లాగసాగిరి.

దేశములో రాష్ట్రీయ కోర్టు లనబడు వాని యందు ముప్పదిమంది. ఆంగ్లేయులు హిందూ మహమ్మదీయజడ్జీల సహాయముతో పనిచేయుచుండిరి. ఆస్తికిని వ్యక్తులకును సంబంధించినట్టి హిందూ మహమ్మదీయ ధర్మముల అమలును నేటివు జడ్జీలకే వదలిరి. ఇప్పుడు సుప్రీము కోర్టువారు