పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ

261

1773 లో చేయబడిన రిగ్యులేటింగుచట్టముప్రకారము అన్ని సివిలు క్రిమినలు వ్యవహారములందును ఆంగ్లశాసన ధర్మము అమలుజరుపు సుప్రీముకోర్టు కలకత్తాలో స్థాపింపబడుటతో భారతీయ న్యాయవిచారణ పూర్తిగా రూపుమాసినది. కేవలము హిందూ మహమ్మదీయుల మతధర్మములు, వారసత్వము, వ్యక్తిసంబంధ ధర్మములు తప్ప తక్కిన అన్నివిషయములందును ఆంగ్ల శాసనధర్మములే అమలు జరుపబడెను. జడ్జీలెల్లరు దేశభాషలును ఆచార వ్యవహారములును తెలియని ఆంగ్లేయులే. కంపెనీవారు ప్రవేశపెట్టిన చట్టములు పద్దతులు కేవలము అన్యాయములనియు దేశములో క్రిమినలు విచారణాధికారము కంపెనీవారు వహించుట దేశీయుల హక్కులను హరించుటయే యనియు వారన్ హేస్టింగ్సు అంగీకరించి యున్నాడు. అయినను అట్లు చేయవలసి వచ్చిన దనియు ఆ యధికారమును దేశీయప్రభువుల చేతులలో నుంచినచో కంపెనీఅధికారమునకు భంగము కలుగుననియు అందువలన నీ పద్దతి మంచిదైనను చెడ్డదైనను ఒక ఆంగ్లేయన్యాయపరిపాలనా విధానమును స్థాపించితిమని చెప్పుటకే ఈ అధికారమును తాము వహించితిమనియు హేస్టింగ్సు స్పష్టముగా జెప్పెను.

1770 లో వచ్చిన కరవు తరువాత, పూర్వము 1760లో నియమింపబడిన సూపర్ వైజర్లను వారన్ హేస్టింగ్సు కలెక్టర్లుగా మార్చెను. హేస్టింగ్సు కలకత్తాలో సివిలు క్రిమినలు అప్పీలు కోర్టులను స్థాపించినాడు. ముసల్ మానుల క్రిమినలు ధర్మమును