Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ

259


లేష౯ అనుశాసనము చేయబడినది. ఘోర అన్యాయములుచేసి లంచములు పుచ్చుకొను దుర్మార్గపు అధికారులసంఖ్య పెరిగి పోయినందుననే ఆ చట్టము చేయబడినది. కొందరుశిక్షింపబడిరి గాని దానిని గట్టిగా అమలు జరిపినచో పన్నులవసూలు బాగా జరుగదని కలెక్టర్లు ఉపేక్షించుచుండిరి. కలెక్టరులు నిర్వహించవలసిన కర్తవ్యములు అసంఖ్యాకములుగ నుండెను. జిల్లాలోని అన్ని వ్యవహారములపైన అన్ని శాఖలపైన వారికి అధికారముండెను. ఇంత విశాలప్రదేశమున ఇన్ని పనులను తృప్తికరముగా నిర్వహించుట యనునది అసంభవము. ఇంత పెద్ద సిబ్బందిని అదుపు ఆజ్ఞలలోనుంచి పరిపాలించుట కూడ కష్టమే. అందువలన జిల్లాపరిపాలనలో చాల అన్యాయములు జరుగుచుండెను. (జాన్ బ్రూస్ నార్టన్ —-1854)

ఎనిమిదవ ప్రకరణము

సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ

I

న్యాయవిచారణచేయు అధికారము మొదట కంపెనీవారికి లేదు. తమ నౌకరులు చేయునేరములను విచారించి శిక్షించుట కవసరమని అట్టి అధికారమునివ్వవలసినదని ఇంగ్లీషు రాజునడిగిరి. తమ ఓడలపై నుండు వారిని విచారించి శిక్షించుటలోవలెనే భారతదేశమున తాము స్థాపించిన వర్తకస్థానము లందును అట్టి న్యాయవిచారణ చేయుటకు మొగలు చక్రవర్తివలన అధికారము పొందిరి. ఈ కంపెనీవారు ప్రారంభమున