258
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
ఇట్టివారి తెలివితేటలకు కలెక్టర్లు మెచ్చుకొని తహసీల్దారుపని యొసగుచుండిరి! ఈ రివిన్యూపరిపాలనలో నింకొక చిత్రము గలదు. గ్రామకరణము లెక్కలలో తెలివితేటలు జూపగా రివిన్యూ యినస్పెక్టరు అజమాయిషీలోను తాశిల్దారు జమాబందీలోను తనచాకచక్యము గనపరచును. వీరందరును కలిసి కుట్రచేసి రైతులను పీడించుచు ఎందుకు పనికిరాని ఊసరక్షేత్రములను రైతుల నెత్తి మీద పడవేసి, వద్దు మొఱ్ఱోయని పారిపోయిన రైతులు పట్టా అంగీకరించినట్లుగా దొంగసంతకములు చేసి బాధించుచుందురు. ఆనాటిసర్వేలు పక్కాసర్వేలు కావు. అవి పగ్గము సర్వేలే. దీనిలో దొంగకొలతలు కొలిచి ప్రతియేటనుభీభత్సము జేయుచుండిరి. ఇక జమాబంది నాటకములో నీపాత్రధారులెల్లరు తహసీల్దారుతో గూడుపుఠాణీ చేయుచుండిరి. కర్రలతోను చింతబరికెలతోను చావగొట్టుట, ఖైదులోపెట్టి బాధించుట, చిత్రహింసలు చేయుట రైతులుభరింపవలసిన సామాన్య కష్టములు. వీరిమొర లాలకించువారెవ్వరు లేకుండిరి. పై వారికి చెప్పుకొనుటకు ధైర్యముచాలదు. కలెక్టరుకు చెప్పుకొన్నను తమ తాబేదారులమాటలను నమ్మునేగాని వీరిమాటలను నమ్మడు. తహశీల్దారుకు ఉన్న పోలీసుఅధికారములకు భయపడి అతనిపైన నెవ్వరును సాక్ష్యము చెప్పరు. కలెక్టరులపై నుండిన రెవిన్యూ కమిషనరుకుగాని రివిన్యూబోర్డువారికిగాని అర్జీలు నిచ్చుకొన్న చో వా రాయర్జీలను రిమార్కులకొరకు కలెక్టర్ల కే బంపుచుందురు. అవి బుట్టదాఖలగును. 1822 లో లంచముల రెగ్యు