Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

3


హముతో వర్ణించినాడు. చక్కని యుద్యానవనములుగల పట్టణములు సుప్రసిద్ధములైన నాలుగు గొప్పనగరములు ‘మారజియా' చేరులోపల నితడు చూచినాడు. ఈనగరము ధన కనక వస్తు వాహనములతోను నవరత్నములతోను నిండి యుండెనని వర్ణించియున్నాడు. 16 వ శతాబ్ద ప్రారంభమున దేశమును జూచిన బార్బోసా, బర్టెమాలు లీ సంగతులు నిజ మని నుడువుచున్నారు.

బార్బోసా, క్యాంబేనగరమును వర్ణించుచు అదిచక్కని నగరమనియు, అదిఫలవంతమైన దేశమనియు, వివిధజాతుల వర్తకులతోను, పారిశ్రామికులతోను, వస్తునిర్మాతలతోను నిండియుండెననియు వ్రాసినాడు. 1340-1350 మధ్య మహ్మద్ బిన్ తుగ్లకునాటి ప్రజాపీడన కాలమున దేశమును దర్శించిన ఇబిన్ బట్యూటాకూడ, ఆనాడు తాను జూచిన జనసంకీర్ణములైన మహానగరములు వర్ణించి దేశము అశాంతిలో మునుగక పూర్వముండిన ఔన్నత్యమును సూచించినాడు.

పదునారవ శతాబ్దియారంభమున నేటి పాశ్చాత్యులవలెనే భారతదేశముపట్ల సానుభూతిలేని బేబరుచక్రవ ర్తి ఈ భారతదేశము చాలధనవంతమగు గొప్పదేశమనియు, నిది వెండిబంగారులతో తులదూగుచున్న దనియు వర్ణించి, దీని జన బాహుళ్యమును వివిధ వృత్తులందు పరిశ్రమలందు జీవించు అసంఖ్యాక పారిశ్రామికులను జూచి యచ్చెరువందినాడు. బేబరుచక్రవర్తి అనేక జలాశయములను నీటివనరులను నిర్మించినాడు. క్రొత్త ఫలజాతులు వేయించినాడు.