పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

245


అమ్ముకునే జిరాయితీ హక్కులులేవు. ఈక్రొత్త విధానములో రైతు భూమిని ఆక్రమించి రెండుసంవత్సరములు కట్టుబడి శిస్తు చెల్లించగానే భూమికి హక్కుదారుడు కాసాగెను. అతడాశిస్తు నివ్వగలిగినంతకాలము ఆశిస్తు అతని నెత్తిపైన వేయబడుచుండెను. కావలసినంత బంజరుభూమి యుండెను. రైత్వారీపద్దతిలోని రైతు సాగుచేయని భూమికికూడా పన్ను లిచ్చుకోవలసియుండెను. తరువాత జనసంఖ్య పెరిగి జిరాయితీ హక్కు విలువగలిగినదై నంతటనే రైతులు షాహుకార్లచేతులలో జిక్కి అప్పులపాలు కాసాగిరి. భూమిని విక్రయించుటకు తనఖాయుంచుటకు రైతుకు హక్కుగలిగినంతటనే ఋణముచేయు పరపతియు హెచ్చెను. రొక్క శిస్తు కిస్తీ చెల్లించుటకు షాహుకారుకు ధాన్యమమ్ముట ఋణముచేయుట అవసరమయ్యెను. రైతులు వివాహములకు కర్మలకుగూడ హెచ్చు సొమ్ము ఖర్చుపెట్టుచు ఋణపడసాగిరి.

కారన్ వాలిసుచేసిన రెగ్యులేషన్లు వంగరాష్ట్రమునుండి 1802 లో మద్రాసుకు వ్యాపింపగనే ఆంగ్లేయ సివిలు, క్రిమినలు సంహితలు అవతరించి, పూర్వము రివిన్యూవసూలులో తాశీల్దారులు చేయు దురాగతములు కొంతతగ్గినను, బీదరైతుకూడా నిర్భయముగా ఆంగ్లన్యాయస్థానములకుబోయి న్యాయము పొందవచ్చు ననుసిద్ధాంతము ప్రబలినను ఆచరణలో ధననంతులు బలపంతులునగు జమీందారులు షాహుకారులు మాత్రమే న్యాయస్థానముయొక్క లాభములు పొందగలుగు చుండిరి. కోర్టులలో అత్యధిక ఖర్చులు భరించి వీరు రైతులను పీడింప గలుగుచుండిరి.