Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఎక్కువమంది పనిచేయుచుండిరి. రైతులు నిలుకడగా భూములను అంటిపెట్టుకొని యుండరైరి. వంగరాష్ట్రమున శాశ్వతకవుళ్లుగాక కేవలము వ్యవసాయతరుణమునకు, ఒక ఫసలీకి మాత్రమే కవులుపొందువా రధికముగానుండిరి. భూములకు రైతుఒత్తిడి చాల తక్కువగానుండెను. అందువలన భూములయందు జిరాయితీ హక్కులకు విలువ తక్కువ. జిరాయితీ హక్కులు లేనప్పుడు ఆ కల్లోలపు రోజులలో షాహుకారులు ఋణ మిచ్చుటయు తక్కువగ నే యుండి ఋణభారమును తక్కువగనుండెను. విభక్తకుటుంబము లభివృద్ధిజెంది హిందూ మహమ్మదీయ వారసత్వపద్ధతుల ప్రకారము కొమాళ్ళసంఖ్య హెచ్చినకొలదియు భూములు పంపిణీ చేయబడి రైతులకుగల భూవిస్తీర్ణము తగ్గిపోవుచుండెను. 1877 కు పూర్వము 70 సంవత్సరములలో రైతులకు సగటునగల భూమివిస్తీర్ణము సగమునకు తగ్గిపోయెను. భారతదేశము అనాదినుండి వ్యవసాయ ప్రదేశము గనుక క్రొత్తగా సాగులోనికి వచ్చిన భూములు చాలతక్కువ. భూములకు ఎరువుగా నుపయోగించు పేడను పిడకలుగచేయు చెడుఅలవాటువలన భూసారము వృద్ధికాలేదు. క్రొత్తనీటివసతుల నిర్మాణము లేనందున పల్లపుసాగు హెచ్చుకాలేదు. బ్రిటిషువారి ఆర్థిక సిద్ధాంతము ప్రకారము భూములకు రొక్కశిస్తు నిర్ణయింపబడి, అది నిర్ణీతకాలములో వసూలు చేయబడుచుండెను. అది చెల్లించుటకు రైతులు అశక్తులై కష్టపడసాగిరి.

బ్రిటిషు వారు రాకపూర్వము రైతులకు భూములలో