242
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కేవలము మతాచారములపైన వీని బలము ఆధారపడియుండినందున క్రొత్తపరిస్థితులలో కులకక్షలు, గ్రామకక్షలు వృద్ధియై విదేశీయుల బారినుండి స్వాతంత్ర్యమును కాపాడుకొను ఐకమత్యము క్షీణించుచుండెను. రాజు, నవాబులు, జమీందారులు, దేశపరిపాలనము చక్కగా నిర్వహించి, దేశరక్షణ చేసి, జాతీయనాయకులుగా వ్యవహరింప లేకుండిరి. కేవలము బలవంతముగా రినిన్యూ వసూలుచేయుట తప్ప దేశప్రజలకు వీరుచేయు ప్రత్యుపకారము లేకుండెను. బ్రిటిషునారు. రాజ్యాధిపత్యము సంపాదింపగానే ఈతరగతివారి నెల్లరను జమీందారు లని వ్యవహరించి. దేశములోని భూములందు వీరికిగల హక్కులను నిర్ణయించుట, భూమిశిస్తువసూలు పద్ధతులను క్రమపరచుట యనునది యొకపెద్ద సమస్యగానుండెను. ఆంగ్లేయు లీ దేశమునకు వచ్చునప్పటికి మొగలాయి పరిపాలనలో భూమిశిస్తువసూలు హక్కులను ఇజారాకిచ్చు పద్ధతి అమలులో నుండెను. తమదేశమునగల భూస్వామ్యపద్దతికి నీ దేశమున తాము చూచిన భూస్వామ్యపద్ధతికినిగల తారతమ్యము నాంగ్లేయులు గ్రహింప లేకపోయిరి. భూములకెల్ల హక్కుదారు ప్రభుత్వమేయనియు, జమీందారులకు, జాగీరుదారులకు శిస్తువసూలు చేయు ఇజారాదార్లకు ఉద్యోగులకు కూడా ప్రభుత్వముక్రింద తాబేదారీ భూస్వామ్యాధికారములు కలవనియు, వారెల్లరు ప్రభుత్వమునకు కట్టుబడి చెల్లింపవలసిన . భూస్వాములేయనియు భ్రమపడిరి.
భూమిశిస్తు అనునది ఒక పన్ను కాదనియు అది కట్టుబడి