పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

భారత దేశమున


ముల విభవములనెరిగినవారు కూడ ఢిల్లీసింహాసనము చుట్టు నానాడుండిన యలంకారములను పరివారమునుజూచి ముక్కుల పై వ్రేళ్ళిడికొనుచుండిరి. ఆనాడు మొగలాయి చక్రవర్తుల ఫర్మానాలు పొందిన రాజప్రతినిధుల పరిపాలనమున ఫ్రెంచి దేశపు రాజుక్రిందగాని జర్మనీ చక్రవర్తి పరిపాలనమునగాని యుండినంతమంది ప్రజలుండిరి. వారి రాబడులును వారివానితో సమానము లైనవే.

బ్రిటిషుప్రభుత్వము స్థాపింపబడక పూర్వము పదునాల్గు పదునారవ శతాబ్దములనాటి హిందూ దేశస్థితిని ఆంగ్ల చరిత్ర కారుడగు ఎల్ ఫిస్ స్టస్ వర్ణించియున్నాడు: “ఫిరోజిషా యొక్క చరిత్ర కారుడు (1351-1394) ఆనాటిరైతు లనుభవించు సౌఖ్యమునుగూర్చియు, నాటి గృహములు, అందలి గృహోపకరణములు, వస్తుజాలమును గూర్చియు, నాటి స్త్రీలు వెండిబంగారు నగలు విరివిగా నుపయోగించుటను గూర్చియు, చిత్రవర్ణనలెన్నో చేసినాడు. ఇతని కతిశయోక్తు లన్న ప్రీతియేగాని, ఇత డనేక సంగతులు చెప్పుచు రైతుల ఇండ్లనంటి యొక్కొక్క చిన్నతోట యుండెననియు వివరించుట చూడగా నాటి ప్రజలు సౌఖ్య మనుభవించుచుండిరనుటకు సందియము లేదు. ఆనాడు ప్రజాపీడన మనునది యావంతయైన నున్నట్లు గానరాదు."

నాటి భారతదేశము ఔన్నత్యస్థితిలో నుండెనని 1420 లో దేశములో తిరిగి చూచిన 'నికోలోకోంటీ' చెప్పుచున్నాడు. గుజరాతులోను, గంగా తీరమునను జూచినవిశేషము లితడుత్సా