రాజ్యాంగ నిర్మాణము
229
నిర్నయింపబడెను. ఇట్లు దేశాదాయ మింగ్లీషుసైన్యము ఖర్చులక్రింద తాకట్టుపెట్టబడు విధానము స్థాపింపబడెను. 1784 మొదలు భారతదేశ వ్యవహారములు రెండు ముఖములుగా నడువజొచ్చెను. భారతదేశమున తమ పెట్టుబడియొక్క లాభములు తగ్గిపోకుండా ముడివస్తువుల పంటలనుపండించు శక్తినిమాత్రము ప్రోత్సహించి వానిని సీమ కంపవలసినదనియు భారతదేశప్రజల ఆచార వ్యవహారములజోలికి మాత్రము పోవలదనియు మతముపట్ల సహనము కలిగి యుండుడనియు కంపెనీ డైరక్టర్లు భారతదేశ గవర్నరుజనరలుకును, గవర్నర్లకును వ్రాయుచుండిరి. ఇక ఈదేశప్రభుత్వముపైన పెత్తనము వహించుటకు ఇంగ్లండు ప్రభుత్వమువా రేర్పరచిన బోర్డువారన్ననో బ్రిటిషు రాజ్యమును వ్యాపింపజేసి గట్టిచేయుడని వీరిని హెచ్చరించుచుండిరి.
III
1797 సం|| కంపెనీ సన్నదు చట్టము :
కంపెనీవారి ఆంతరంగిక వ్యవహారములను భారతదేశ వ్యవహారములనుగూర్చి ఈచట్టము చేసిననిబంధనలే చాలకాలము అమలుజరిగెను. తరువాత కొద్దిమార్పులు జరిగెను. భారతదేశములోక్రొత్తపరిస్థితులకు అనుగుణముగా ఏర్పాట్లు కట్టుబాటులు చేయబడెను. స్వదేశ సంస్థానాధీశులకు అప్పులిచ్చుటవలన అనేక అన్యాయములు జరుగుచుండినందున ఎవ్వరును అప్పు ఇవ్వకూడదని నిషేధింపబడెను. దీనికి కారణము అట్టి ఋణములనుగూర్చిన ఫిర్యాదులు చిక్కులు వచ్చుటయే. కారన్