Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ముగ్గురు కార్యాలోచన సభికులుందురు. వారిలో నొకడు సేనాని. వంగరాష్ట్రమునగాక తక్కినరెండు రాజధానులలోను గవర్నరులును వారికి సహాయముచేయుటకు ముగ్గురుచొప్పున కార్యాలోచనసభికులు నేర్పరుపబడిరి. వీరిని నియమించుటలో కంపెనీ డైరెక్టర్లకు అధికారముండెను. యుద్ధప్రకటన, సంధి వ్యవహారములందే గాక కంపెనీ డైరెక్టర్లు నిర్నయించిన విషయములందు గూడా గవర్నరు జనరలుకు కౌన్సిలుకు తక్కిన రాజుధానులపైన పెత్తనము లివ్వబడెను. పరువుకు భంగముగల్గిన తప్పదేశాక్రమణకొరకు యుద్ధములు చేయకూడదని శాసింపబడెను. యుద్ధము ప్రకటించుటకు సంధిచేయుటకు డైరెక్టర్ల అనుమతి పొందవలెను. న్యాయవిచారణమునందు కంపెనీ నౌఖరులతో పాటు దేశపౌరులందరిపైన అధికారము ఇవ్వబడెను. బహుమతులు లంచములు నిషేధింపబడెను. సివిలు మిలిటరీ ఉద్యోగముల సంఖ్య తగ్గించుటకు డైరెక్టర్లకే అధికార మివ్వబడెను. ప్రమోషనులు సీనియారిటీ ప్రకారము చేయబడవలెననియు నిర్ణయింపబడెను.

తరువాత నీ చట్టములో మరల కొన్నిమార్పులు చేయబడెను. కౌన్సిలు అభిప్రాయమునకు విరుద్దగా ప్రవర్తింపగల అధికారము గవర్నరుజనరలు కొసగబడెను. కంపెనీకి సన్నదు నిచ్చునప్పుడు దేశాదాయములోనుండి కంపెనీవారు బ్రిటిషు ప్రభుత్వమునకు హెచ్చుసొమ్ము నివ్వవలెనను ఆలోచన జరిగెను. కాని అది మానివేసి దేశాదాయమును ముందుగా సైన్యము కొఱకు ఖర్చుచేయు బ్రిటిషు రాజ్యతంత్రపద్ధతి