Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



భారత దేశమున

బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము

ప్రథమ భాగము:

ఇంగ్లీషు దొరతనము - చారిత్రక సమీక్ష

1600-1937

మొదటి ప్రకరణము

బ్రిటీషు యుగమునకు పూర్వమునాటి భారతదేశ స్థితి.

I

భారతదేశమున బ్రిటీషు ప్రభుత్వము స్థాపింపబడక పూర్వ మీదేశ మధోగతిలో నుండెననియు, ఆ ఘోర దుస్థితినుండి తామీదేశము నుద్దరించితిమనియు, బ్రిటిషుసామాజ్య తత్వవాదులు పలుకుచుందురు; బ్రిటిషువా రీదేశమున కాలిడు నప్పటి కీ దేశస్థితి యెట్లుండెను? పదునారవ శతాబ్దిలో భారత దేశమున మొగలాయి చక్రవర్తులేలిన సామ్రాజ్యము ప్రపంచమున చాల సుప్రసిద్ధ మైనది. ఐరోపాఖండమున నే రాజు క్రింద నందరు ప్రజలు లేరు. ఏ ప్రభుత్వమునకును నంత రాబడి లేదు. ఐరోపాలోని జగత్ప్రసిద్ధకట్టడములను జూచిన విదేశీయులు గూడ హిందూస్థానమునందలి చక్రవర్తులు నిర్మించిన సుందర హర్మ్యములనుజూచి ముగ్ధులైపోవుచుండిరి. ఐరోపాసామ్రాజ్య