222
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
32 లక్షలు మాత్రమే క్లైవు “మొగల్ సర్కారు"న కిచ్చుచుండెను. నవాబు సొమ్ములేక రాజ్యభారము చక్కగా నిర్వహించ లేకుండెను.
“చక్రవర్తి ఫర్మానా ననుసరించి మూడు రాష్ట్రములపైన వసూలు చేయబడు పన్నులలోనుండి వంగరాష్ట్ర నవాబుకు ఇంటిఖర్చులకొరకు 17 లక్షలు, నవాబు దర్జాను నిలువబెట్టుటకు కావలసిన రక్షకభటులు, పోలీసువగైరా సిబ్బందికొరకు 36 లక్షలును వెరసి 53 లక్షల రూపాయిలు ప్రతిసాలున చెల్లించునట్లు ఒడంబడిక జరిగెను. ఈ మూడు రాష్ట్రములపై ననువచ్చు అమాంబాపతు శిస్తులు కలిసి రెండుకోట్ల రూపాయిలకు తక్కువలేదని అంచనా వేయబడి యున్నది." (చూడు. టారెన్సు-ఆంగ్ల రాజ్యస్థాపన పుట 114)
ఇట్లొసగబడిన దివానీ యధికారము కేవలము శిస్తుల వసూలు అధికారమే యైనను కంపెనీవారు దీనికి తరువాత అపార్ధములు కల్పించి ఈ మూడు రాష్ట్రములయందు చక్రవర్తి తనకుగల సర్వాధికారములను వదలుకొని వాని పరిపాలనాధికారము తమకొసగినాడని వాదించి ఆయధికారముల నెల్ల చలాయించిరి. తరువాత నీ కంపెనీవా రేయన్యాయములకు గడంగినను చక్రవర్తి వలన నధికారమునుపొందియే యట్లు చేయుచున్నట్లు చాలకాలమువరకు నటించిరి.
1767 సంవత్సరపు కంపెనీ పట్టాచట్టము.
తూర్పుఇండియా కంపెనీవారు భారతదేశమున వర్తకము చేయుచు.. గొప్ప జమీందారీని సంపాదించుటయేగాక