Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

221


లకు ప్రత్యుపకారముగా అతడు ఆ రాష్ట్రములందలి దేశాదాయమును వసూలుచేయు "దివానీ"గిరీ అధికారము వీరి కొసగెను. ఈ ఆదాయములో సాలుకు 26 లక్షలు మాత్రము 'సర్కారు' కొసగుచు మిగతాసొమ్ము తమ సైనిక వ్యయముక్రింద వారే అనుభవించవచ్చును. నిజముగా కంపెనీవారు బలవంతులైనందుననే ఈ ఫర్మానా జారీచేయుటయు అది అమలు జరుగుటయు సంభవించినది. దీనికే “దివానీ” అని పేరువచ్చినది. ఇట్టి “రాజస్య" అధికారములను పొందియు, కంపెనీవారు అప్పటికే దేశమున పరిపాలనాధికారమును చలాయించుటకు శక్తికలవారైననుగూడా వీరు బహిరంగముగా తమ ప్రభుత్వమును ప్రకటింప సాహసింపక తాము పన్నులు మాత్రము వసూలుచేయుచు, పరిపాలన భారము నవాబుపైననే వేసి నడుపదలచిరి. ఇది ఆనాడు గవర్నరైన క్లైవు నడిపిన రాజ్యతంత్రము. ఇక దేశముయొక్క సివిలుపరిపాలన పోలీసు న్యాయవిచారణ శాఖలు నవాబు నిర్వహింపవలసినట్లు కూడా అతనితో కంపెనీవారు ఏర్పాటు చేసికొనిరి. ఈ ఏర్పాటులన్నియు సంధిపత్రములో లిఖితమూలముగానే చేసుకొనిరి. ఈ దివానీ అధికారమును చలాయించుటలో కంపెనీ గవర్నరగు క్లైవు చాలతెలివితేట లుపయోగించెను. కంపెనీకి దమ్మిడీయైన ఖర్చులేకుండా దళారీలకు ఇజారాలనిచ్చి సొమ్ము వసూలుచేయించెను. వీరే తరువాత జమీందారులైరి. వీరు ప్రజల నెన్ని విధములుగానైన బాధించి సొమ్ము వసూలు చేయుచుండిరి. దేశములో 150 లక్షల రూపాయిలు వసూలుచేసి ఇందులో