రాజ్యాంగ నిర్మాణము
219
అంతట నీ కంపెనీవారికి ఋణ మవసరము కాగా అందు కవసరమైన అధికారమును పొంది 1694 లో 12 లక్షల పౌనుల ఋణపత్రములను జారీచేసిరి. ఇట్లురాజస్వకోశసంబంధ అధికారములుకూడ వీరికి లభించెను.
భారతదేశమునందు కేవలము వర్తకము చేయుటకు వచ్చిన వ్యాపారసంస్థ తన వ్యవహారములు నిర్వహించుకొను నెపముననే ఇట్లు కొన్ని రాజకీయాధికారములను పొందెను. అంతట వీరి ఫ్యాక్టరీ పరిపాలకులగు గవర్నరులు కౌన్సిళ్ళు ఒక విధమగు పరిపాలనాధికారముగల సంస్థలుగా పనిచేయసాగెను. నాటి కింకను వీరికి శాసననిర్మాణాధికారము లేదు. వీరి వర్తకస్థానములందు కేవలము సైనికశాసనమే అమలులో నుండెను. ఇట్టి స్థితిలో బొంబాయి కౌన్సిలు ప్రెసిడెంటు, ఈ కంపెనీ యొకవిధమైన స్వతంత్రరాజకీయ సంస్థగానున్నందున తమ ఫ్యాక్టరీల పరిపాలనకు సంబంధించినంత వరకైనను శాసననిర్మాణాధికారము చలాయించు హక్కు వీరికి కలదని వాదింపగా 1686 నాటికి శాసననిర్మాణ అధికారముకూడా ఏర్పడి మద్రాసు కలకత్తాలలో గూడ చలాయింప బడసాగెను. ఈకంపెనీవారు. భారతదేశములో ప్రయోగించిన రాజ్యతంత్రమువల్ల దీని అధికారములెల్ల క్రమక్రమముగా అభివృద్ధిగాంచి కంపెనీ నొక జమీందారీగాను స్వతంత్ర సంస్థానముగాను తుదకు దేశపరిపాలనజేయు ప్రభుత్వముగాను మార్చిన చరిత్ర చాల చిత్రమైనది.
జేమ్సు మిల్లు తన చరిత్రలో చెప్పినట్లు ఔరంగజేబు