218
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
ర్లపైన తామేసివిల్ క్రిమినల్ చర్యలు జరుపుకొను అధికారములను మొగలాయి చక్రవర్తి ఫర్మానా వలన పొందిరి. దీనిని పురస్కరించుకొని తరువాత వీరు తన ప్రజలపైన కూడా అధికారము చలాయింతురని అతడు కలనైనను తలపలేదు. ఈ కంపెనీలో చేరిన వారుతప్ప ఇతరు లెవరైనను తమతో పోటీవ్యాపారము చేయవచ్చినచో వారిపైన ఓడదొంగలను నేరములుమోపి హింసించుచుండిరి. తమదేశస్థులను నౌకర్లనుగూడ వీరికాలమున చిత్రహింసలు చేయుచుండిరి. వీరికి సైనిక శాసనాధికారము రాక పూర్వము వీరు కొరడాలతో చావబాదుచుండిరి. తరువాత ఓడదొంగలను ఉరితీయుటకొరకు వీరుపొందిన అధికారమును దుర్వినియోగము చేయసాగిరి. స్వతంత్రవర్తకుల ననేకులనట్లు ఉరిదీసిరి. వీరి దుండగముల కాగ్రహించి మొగలుచక్రవర్తి వీరిని మందలించుటయు వీరిపైన దండయాత్ర చేయుటయు కూడ జరిగినది.
ఫ్యాక్టరీప్రదేశములం దుండువా రెల్లరిపైనసు గూడ క్రిమినలు విచారణాధికారము ఫ్యాక్టరీ కౌన్సిలు సభాయుతులగు గవర్నరుల కొసగబడుటకు ఫర్మానా పొందిరి. 1676 నాటికి కంపెనీవారు భారతదేశములో రాజ్యతంత్రము నడుపు పద్దతిలోనికి దిగినందున యుద్ధము లవసరమైనందున ఆసియా దేశములందలి రాజులతోను ప్రభుత్వములతోను యుద్ధప్రకటన చేయుటకు సంధి చేసికొనుటకు అనుజ్ఞను పొందిరి. 1686 లో కంపెనీవారి అధికార ప్రదేశములందు న్యాయపరిపాలనజేయుట కొక న్యాయస్థానము నెలకొల్పబడెను.