216
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
వలసిన అధికారములు మాత్రమే ఒసగియుండెను. రాణీవల్ల పట్టాపొందిన ఈ కంపెనీ ఒక రాజకీయసంస్థగాని రాజ్యాంగ సంస్థగాని కాదు. కేవలము వ్యాపారసంస్థ. అందువల్ల ఇతరులతో యుద్ధము చేయుటకు సంధి యొనరించుటకు అధికారము గాని, దేశాక్రమణము జేసి రాజ్యపరిపాలసము చేయు అధికారముగాని దీనికిలేదు. రాజ్యపరిపాలనలో ప్రధానాధికారములగు పరిపాలన శాసననిర్మాణ న్యాయవిచారణలు జేయు అధికారములును లేవు. ఈ అధికారములెల్ల ఈకంపెనీవా రింగ్లాండురాజులవలన పార్లమెంటు వలన క్రమక్రమముగా పొంది భారతదేశములో రాజ్య పరిపాలనచేయు అధికారులైరి. ఈ కంపెనీవారి వాటాదారులు ఇంగ్లాండులోనేయుండి దీని వ్యవహారములు నిర్వహించుటకు కమిటీగానుండిరి. 500 పౌనుల వాటాయున్న వారికి వోటుహక్కు 2 వేల పౌనుల వాటాయున్నచో డైరెక్టరుగా ఎన్నుకొనబడుహక్కును ఉండెను. మెజారిటీ అభిప్రాయమునుబట్టి వ్యవహారములు తీర్మానించుకొనిరి. మొదట ఈకంపెనీ కార్యనిర్వహణము 24 మంది వాటాదారులు, ఒక గవర్నరు, కలిసిన “జనరల్ కోర్టుఆఫ్ ప్రొప్రయిటర్ల 'నియు, తరువాత “డైరెక్టరుల కోర్టు" వారను గౌరవ బిరుదుతోను పనిచేసెను. వీరు ప్రారంభములో నిండియాకు ఓడల నంపి అచ్చట ఎగుమతి దిగుమతి వ్యాపారము చేయుటకు వీలుగా నుండునట్లు సముద్రతీరములందు వర్తకస్థానములను నిర్మించిరి. ముఖ్యమైన వర్తక స్థానములగు మద్రాసు బొంబాయి కలకత్తాలలోని ఫ్యాక్టరీ వ్యవహారములను నిర్వహించుట కొక