208
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
చేయబడినందునను బెంటింకుపైన తెల్లవారు క్రోధమువహించి దుర్భాష లాడసాగిరి. గాని బెంటింకు లెక్క సేయలేదు. “నోరులేని జనసామాన్యము అజ్ఞానులగు అవకాశము చూచుకొని ఆ అజ్ఞానమును చిరస్థాయిగా చేసి దానివలన అక్రమలాభములను కొన్ని పొందుటయే ఈ ప్రభుత్వముయొక్క ఉద్దేశమను తలంపు బ్రిటీషునీతికిని ధర్మమునకును విరుద్దము" అని బెంటింకు ప్రభువు పలుకుచు పాఠశాలలను విరివిగా స్థాపించి విద్యాభివృద్ధికి తోడ్పడెను. దేశీయవార్తా పత్రికలను స్థాపింప బ్రోత్సహించెను.
విలియంబెంటింకు ఇట్లు ఏడేండ్లు అతిసమర్థతతో పరిపాలించి 1835 లో తన పదవి చాలించుకొనెను. తరువాత నితడు పార్లమెంటు మెంబరై 1839 లో చనిపోయెను.
భారతదేశము భారతీయుల క్షేమలాభముల కొరకే పరిపాలింపబడవలెననియు దానివలన బ్రిటీషువారు పొందు లాభములు కేవలము నైమిత్తికములుగ మాత్రమె యుండవలెననియు ప్రధానములై యుండరాదనియు నొక గొప్ప సూత్రమును విలియంబెంటింకు ప్రారంభించెనని ఇంగ్లాండులో 1853 లో ప్రభువులసభలో సాక్ష్యమిచ్చుచు ట్రెవెలియ౯ పలికినాడు.
VI
1836 మొదలు 1856 వరకును అనగా బెంటింకు పదవి చాలించుకొనిన తరువాత 'మన్రో ఎల్‌ఫి౯స్ట౯'ల నాటి మంచి పద్దతులు బెంటింకునాటి ఔదార్యాదిగుణములు అడుగంటి