పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చీలదీసి ఆంగ్లేయకంపెనీతో సంధి ఒడంబడిక చేయించినచో నీ సమ్మేళనము బలహీనమై, విచ్చిన్న మగునని వెల్లస్లీ వెంటనే నిశ్చయించి బెస్సీను సంధిజేసెను. (చూడు:మిల్లుయొక్క చరిత్ర). వీరిరువురును తరువాత మహారాష్ట్రరాజులతో కుట్రలు చేయసాగిరి. సింధియాక్రిందనున్న ఫ్రెంచి సైనికాధికారులకు లంచములిచ్చి తిరుగ దీయుటకును, ప్రజలచే పితూరీ చేయించుటకును ప్రయత్నించిరి. రెండవ మహారాష్ట్రయుద్ధము కేవలము వెల్లస్లీ స్వంతబాధ్యతతో జరిగించినాడు. ఈయుద్ధము సంగతి ఇంగ్లాండుకు చాల రోజులవరకు తెలియనేలేదు. రాజ్య తృష్ణయే దీనికి కారణము. ఈ యుద్ధములందు సేనానాయకుడుగా పనిజేసిన జనరల్ 'లేకు' కేవలము దుర్మార్గుడు. వెల్లస్లీ సోదరుల కీ కుట్రలయందు ఇతడు కుడిభుజముగ నుండెను. ఢిల్లీ చక్రవర్తికి మహారాష్ట్రులందు ద్వేషము పుట్టించుటకును అతనిని తమ రక్షణక్రిందికి రమ్మనియు వెల్లస్లీ 1803 లో ఒక లేఖవ్రాసి లేకుసేనానిద్వారా పంపెను. చక్రవర్తికనేక యాశలు కలిగించెను. ఇట్లే సుప్రసిద్ధురాలగు “బీగం సమ్రూ' కుగూడా ఆసలుగొల్పి ఆమెకును లేఖలువ్రాసిను. బీరారు రాజులయెడల కుట్రచేయవలసినదని తన సైనికోద్యోగికి వెల్లస్లీ 1803 ఆగష్టు 3వ తేదీన ఉత్తరము వ్రాసెను. జనరల్ వెల్లస్లీ ఆగష్టు 24 వ తేదీన మేజరుషాకు వ్రాసినలేఖలో “ పీష్వా పూనానుండి , పారిపోవునని నాకు తోచదు. పోయినచో అతని మంత్రులకు తెలియకుండా (పీష్వా) పోవగలడనియు తోచదు. కర్నల్ క్లోజుకు నేను వ్రాసిన లేఖలలో ఎప్పటికప్పుడు సంగతులు