పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


పరిపాలనలోను న్యాయవిచారణలోను శిస్తుల వసూళ్ళలోను చేయుచుండిన అన్యాయములు తొలగించుటకు వారి జీతములు హెచ్చించుట ముఖ్యమని అట్లుచేసెను. కలెక్టరుల న్యాయవిచారణ అధికారము తీసివేసి జిల్లాకోర్టులు స్థాపించెను. దేశపరిపాలన కవసరమని తోచిన అనేక శాసనములుచేసెను. ఈ సంస్కరణలు చేయుటలో అతని యుద్దేశము భారతదేశ ప్రజల నుద్దరించవలెననికాదు. ఆనాడు కంపెనీ ప్రభుత్వము చెడిపోయియున్నందున దానిని కట్టుదిట్టముగ చేయవలెననియె. వార౯ హేస్టింగ్సుయొక్క దుష్పరిపాలనము తరువాత నితడు వచ్చి అతనివలె బహిరంగముగా ఘోర అన్యాయములు జేయనందున నితడు కేవలము ధర్మరాజని కొందరు చరిత్రకారులు పొగడుచుందురు. కాని నిజముగా నితడు మన దేశమునకు చేసిన మేలు వార౯ హేస్టింగ్సు క్లైవులవలె ప్రవర్తింపక పోవుటయే." (Rise of Christian Power in India. — B. D. Basu.)

కారన్ వాలిసు 1786లో వచ్చినపిదప కంపెనీ యుద్యోగుల జీతములన్నియు వృద్ధిచేసి వారి స్వంతవ్యాపారమును రాజులకు నవాబులకు పెట్టుబళ్ళుపెట్టుటను నిషేధించెను. 1773 లో చేయబడిన రెగ్యులేటింగు ఆక్టు క్రింద గవర్నరుజనరలుకు సాలుకు 25000 పౌనులు (2 1/2 లక్షల రూపాయిలు'), కౌన్సిలుమెంబర్ల కొక్కొకరికి సాలుకు 10 వేల రూపాయిలు జీతములు నిర్ణయింపబడెను. సామాన్య ఉద్యోగులలో ఆరుసంవత్సరముల సర్వీసుఅనుభవముగల వారికి సాలుకు 1500 పౌనులును, 12 సంవత్సరముల సర్విసుగలవారికి 4000