ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము
193
కొన సాగిరి. ఈఅన్యాయములను విమర్శించినందుకు మెట్కాఫుపైన గవర్నరుజనరలుకు కోపమువచ్చెను. పామరుకంపెనీ వారి అక్రమములు బయల్పడగా ఆంగ్లేయకంపెనీ డైరెక్టర్లు గవర్నరుజనరలును వెనుకకు రమ్మనిరి. 1823 లో 7 నెలలు గవర్నరుజనరలుగా పనిచేసిన 'ఆడం' ఈ పామరుకంపెనీవారి బాకీలలో కొన్ని అబద్దపు బాకీ లని తీసివేసెను. పామరు కంపెనీకి 80 లక్షల పౌనులు చెల్లింపబడెను. తరువాత నీ పామరు కంపెనీవారు తాము చెల్లించవలసిన సామాన్య బాకీలుకూడా చెల్లించకుండా దివాలా అయిరి. ఈ సంగతి 1828 డిశంబరులో మెట్కాఫు కవున్సిలులో నివేదించినాడు. 1833 లో నీ కంపెనీ వ్యవహారములనుగూర్చి మరల నొక అభియోగ మింగ్లాండులో తేబడినది. ఇట్టి గోల జరుగుచుండగా 1834 లో అయోధ్య నవాబు తమకు 15 లక్షల పౌనులు బాకియున్నాడనియు అది అయోధ్య రివిన్యూ నుండి ఇప్పించవలసినదనియు దొరలు పెట్టుకొన్న అర్జీలను అంగీకరించుట కిష్టములేక పార్లమెంటువారు 1834 లో దానిని త్రోసివేసిరి. (తాంప్సస్ గెరాట్ గార్ల బ్రిటిషు రూల్).
ఐదవ ప్రకరణము
ఆంగ్లగవర్నరు జనరలుల దొరతనము
I
కారన్ వాలిస్
వార౯ హేస్టింగ్సు తరువాత 1786లో గవర్నరు జనరలైన కార౯ వాలిసు రాగానే కంపెనీ యుద్యోగులు సివిలు