192
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
బాకీల విషయములో నేటివు బాకీదార్లకన్న ఆంగ్లేయ బాకీదార్లకు పక్షపాతము చూపబడెను.
V
హైదరాబాదు నైజాంగారి బాకీలు
గవర్నరుజనరలుగ నుండిన లార్డుహేస్టింగ్సు పాలకపుత్రికభర్త రంబోల్డు హైదరాబాదులో పామరుకంపెనీలో ముఖ్య భాగస్థుడుగ నుండెను. కంపెనీవారు నెలకు 20 వేల పౌనులచొప్పున సాలుకు నూటికి 25 వంతుల వడ్డీపైన నైజాముకు ఋణమివ్వగా నైజాముసాలుకు 300000 పౌనుల రివిన్యూ వీరికితాకట్టుపెట్టెను. ఇది ఎన్నాళ్ళకునుతీరదు. గవర్నరుజనరలు కంపెనీపై నభిమానము వహించెను. ఈకంపెనీ నైజామును పీల్చి పిప్పిచేయసాగెను. ఈసందున నైజాము ఖర్చుపై న కలకత్తాలో దీపములు నీటి సరఫరా చేయునట్లు హేస్టింగ్సు స్వదస్తూరీతో నైజాముతో సంధిపత్రములో నొకషరతును వ్రాసెను; గాని నైజాము నిట్లు బాధించుటకు తూర్పుఇండియా కంపెనీ డైరక్టర్లు అంగీకరించలేదు. హైదరాబాదు రెసిడెంటగు మెట్కాపు పామరు కంపెనీ దుర్నయములు చూచి అసహ్యపడెను. 1820 లో పామరుకంపెనీవారు 60 లక్షల పౌనుల మొత్తమును క్రొత్తబాకీ అను పేరున పాతఋణమునే నైజాము నెత్తిపైన వేయదలచిరి. ఈ ఋణముపైన వడ్డీ నూటికి 18 కి తగ్గింపబడినది; కాని ఇది అన్యాయమని మెట్కాఫు వ్రాసినాడు. అంతట పామరుకంపెనీవా రెప్పటివలెనే నైజామువలన నూటి కిరువదైదువంతుల పడ్డీప్రకారము ఋణపత్రములు వ్రాయించు.