Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల వడ్డీ వ్యాపారము

191


యమై ఈ బాకీదార్లు గోలచేసి అయోధ్య ప్రభుత్వమునకు ఇంగ్లాండులోని అధికార్లకు అర్జీలు పెట్టుకొనసాగిరి; కాని కంపెనీవారు వినిపించుకొనలేదు. మార్‌క్విన్ ఆఫ్ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నుండగా ఈ బాకీల పరిష్కార విషయము ఇంగ్లీషు ప్రభుత్వముసకు సంబంధించినది కాదనియు నవాబే పరిష్కరించుకోవలెననియు తెల్పుమని రెసిడెంటుకు ఉత్తరువు చేసిరి. ఇంతఅత్యధిక రేట్లతోనున్న ఈ బాకీలు కేవలము జూదరులవ్యవహారముగా కనబడుచున్న వని తూర్పుఇండియా వర్తక సంఘమువారు 1822 మే నెల 31వ తేదీన రికార్డుచేసిరి. కాని బాకీదార్లకు మంచిరోజులు వచ్చెను. భారతదేశ రాజులలో మంచివారు కలరనియు, భారతీయులకు న్యాయమొనరింపవలెననియు సద్భావముతో పరిపాలించు ధర్మాత్ములగు ఎల్‌ఫిన్‌స్టన్, మన్రో, మాల్కలములవంటివారుపోయి ఈ భారతదేశీయులకు తాము న్యాయమొనరింపవలసిన బాధ్యత లేదనియు రాజులచుట్టును చేరి పీడించు ఆంగ్లేయులుచేయు దుర్ణయములను నివారించవలసిన బాధ్యతయు తమకులేదనియు తలచుఅధికారులు బయలుదేరిరి. భారతదేశ రాజులు నవాబులు ఇటు ప్రభుత్వమునకును అటు ఉద్యోగేతరులగు దొరలకును పుష్కలముగాధనము లిచ్చుకోవలసినవారే యను భావము ప్రబలెను. ఈ సమయమున దేశీయరాజుల బాకీలు చెల్లించవలసిన దేయని కొన్ని తీర్మానములు జరిగెను. ఆర్కాటునవాబు బాకీలలో కొన్నిలక్ష లట్లు తీర్మానింపబడెను. ఇట్లే అయోధ్యనవాబు