190
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
IV
అయోధ్య నవాబు బాకీలు
అయోధ్యనవాబు వలన నూటి కిరువదినాల్గు మొదలు 36 రూపాయిలవరకు సాలుసరి కాంపౌండు వడ్డీరేటుచొప్పున పత్రములు వ్రాయించుకొని బాకీదారులు అతనిని పీడించు చుండుట, సామాన్య పరిపాలనకు సొమ్ము లేకపోవుట, రివిన్యూ క్షీణించుటాదిగాగల సంగతులు 1796 లో లక్నో రెసిడెంటు గవర్నరుజనరలుకు వ్రాసినాడు. హిందూదేశమున బాకీలు ఎగవేయుట అమర్యాదగా పరిగణింపబడును. అందువలన ఏదోవిధముగా తీర్చుకొందురు. ఇట్లే నవాబు అసఫ్‌ఉల్‌దౌలా తనబాకీదార్లకు దామాషాగా ఋణ పరిష్కారము చేయదలచెను. అయితే అట్లు పరిష్కరించుటలో బాకీల నిజానిజములు న్యాయాన్యాయములు పరిశీలింపకయే భారతీయుల బాకీలకు తక్కువదామాషా ప్రాప్తిని తెల్లవారి బాకీలకు హెచ్చు దామాషా ప్రాప్తిని చెల్లించుటకు నిశ్చయించెను. దీనికిగల కారణము తెల్లబాకీదారులకు గల అధికారబలమే! ఈ అన్యాయపు పంపిణీకి సల్లవారు కొందరంగీకరింపలేదు. అందువలన వారి బాకీలక్రింద వారికేమియు రానేలేదు. 1797 లో నీనవాబు చనిపోయినాడు. అంతట నీతని కొమారుడు తనతండ్రి ఋణములు పరిష్కరించుట ధర్మమని తలచి ఋణపత్రములను తిరుగవ్రాయసాగెను. ఈ సందులో మరల ననేకులు నూటికి 36 వంతున వడ్డీతో ఋణపత్రములు వ్రాయించుకొనిరి. తమబాకీల పరిష్కారము విష