188
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
చేయజాలకపోయినను, ఇకముందైనను ఇట్టి అన్యాయము జరుగరాదని నిశ్చయించెను. 1784 వ సంవత్సరపు చట్టమువలన గవర్నరు జనరలునకు తనకవున్సిలునుత్రోసి రాజనగల అధికారము కలిగెను. అందువలన కార౯ వాలిసు ధైర్యముగా నీ దుర్మార్గములను నిషేధింపగలిగెను. అనేకమంది పెద్ద యుద్యోగుల నుద్యోగమునుండి తొలగించి సీమకంపి కొన్ని కఠిననిబంధనలను గావించెను. కంపెనీనౌకరులు దేశము వదలిపోవునప్పుడు తమ ఆస్తినిగూర్చిన ఒక ప్రమాణపత్రము దాఖలుచేయవలెనని శాసించెను. ఆంగ్లేయవర్తకులు కలకత్తా దాటి దేశములో వర్తకము చేయదలచినచో నచ్చటి స్థానిక న్యాయస్థానముల అధికారమునకు లోబడియుందుమని పత్రము వ్రాయవలెననియు శాసించెను.
III
నూజివీడుజమీందారు బాకీలు
నూజివీటి జమిందారగు అప్పారావుగారు దొరలకు వ్రాసియిచ్చిన ఋణపత్రముల చరిత్ర చాల చిత్రమైనది. కొన్నాళ్ళు మచిలీబందరులో కంపెనీ యధికారిగనుండి తరువాత మద్రాసు గవర్నరు పనిచేసిన వైటుహిల్లుకును కంపెనీ డైరెక్టరులలో ముఖ్యుడును పార్లిమెంటు బోర్డుసభ్యుడునునగు రైట్ ఆనరెబిల్ జాన్ సల్లివనుకును జేమ్సుహాడ్జెన్ అనునొక దొరకును మరికొందరు దొరలకును కలిసి ఈ నూజివీడు జమీందారు కొన్ని లక్షలరూపాయిలు బాకీయున్నట్లును, ఆఋణముతాను టాన్సుఫరు పొందినాననియు తా నింకను కొంత