Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల వడ్డీ వ్యాపారము

187


స్థానమున మద్రాసుగవర్నరుగా నియమింపబడిన రంబోల్డు చేసిన అన్యాయములకు మేరలేదు. ఆనాడు శిస్తులనిర్ణయము కొరకు నియమింపబడిన కమిటీనితడురద్దుచేసి జమీందార్లను మద్రాసుకు రప్పించి వారివలన అమితధనమును లాగికొనసాగెను. ఇతడు 16 లక్షలరూపాయిలు లంచముపుచ్చుకున్నట్లు రుజువుకాగా 1781 లో నితనిని పనిలోనుండి తీసివేసిరి. (Early British Rule-R. C. Dutt)

1780 ఆ ప్రాంతములందు మద్రాసు ప్రభుత్వ మిట్టి అవినీతిపరులును దుర్మార్గులునగు దొరలతో నిండి అన్యాయములతో ఫుచ్చిపోయియుండెను. ఆ దొరలు లంచగొండెలగుటయేగాక పై యధికారులనుగూడ తృణీకరించునంతటి పొగరుబోతులై యుండిరి. అట్టి వారిలో కొన్నాళ్ళు మచిలీపట్టణమున బనిచేసి మద్రాసు గవర్నరుగాకూడా పనిచేసిన వైట్ హిల్ అను వా డొకడు. ఇతడు గవర్నరుజనరలు ఆజ్ఞలను కూడా ధిక్కరింపసాగెను. అంతట నితనిని 1780 లో సస్పెండు చేసి 1781 జనవరి 15వ తేదీన పనినుండి తొలగించిరి. ఈ వైట్‌హిల్లును మద్రాసు గవర్నరుగా పనిచేసిన రంబోల్డును, ఫెర్రింగు అను ఇంకొకదొరయుకలిసి ప్రభుత్వధన మపహరించినట్లు బయల్పడి విచారణకూడ జరిగెను. రంబోల్డు పుచ్చుకొన్న లంచములు రుజువుకాగా 1781 లో నతనిని డిస్మిసుచేసిరి. వైట్‌హిల్లుయొక్క దుర్మార్గము నూజవీడు జమీందారు బాకీల విషయమున నింకను విపులముగా వర్ణింపబడినది.

గవర్నరుజనరలు-కారన్ వాలిసు గడచినదానికి ఏమియు