184
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
నీరుగా కుదిరెను. ఇతడు డబ్బుదోచుకొనుటలో మొనగాడు . ఆంగ్లేయాధికారులు తంజావూరు రాజ్యమును తమ స్నేహితుడగు ఆర్కాటు నవాబున కిచ్చియుండిరి. (కర్నాటక నవాబునకే ఆర్కాటునవాబు అనియు పేరు) ఆ రాజ్యమును మరల రాజు కిచ్చివేయుడని కంపెనీ డైరెక్టర్లు ఉత్తర్వుచేయగా ఆ సమయములో నీ బెన్‌ఫీల్డు తనకు ఆర్కాటునవాబు 16 లక్షల 20 వేల రూపాయలు బాకీయున్నాడనియు దానిక్రింద తంజావూరు తనకు తాకట్టు పెట్టినాడనియు ఇదిగాక తంజావూరులోని ఆసామీలకు తాను 7 లక్షల 20 వేలు రూపాయలు అప్పిచ్చితి ననియు దానిక్రింద ఆభూములలోని నిలువుపైరు తనకు తాకట్టు ఉంచబడినదనియు వాదింపసాగెను. ఆ రోజులలో మద్రాసు గవర్నరగు 'పిగట్టు' ఈసంగతి సీమలోని డైరెక్టర్లకు వ్రాసెను." అంతట నీతాకట్టు నమ్మతగినదికాదని వారుత్రోసివేసిరి. బెన్‌ఫీల్డు చాలాబలవంతుడు. మద్రాసురాజధాని కౌన్సిలులో నతనికి గొప్ప పలుకుబడియుండెను. అందువలన నతడు తనవ్యాజ్యమును పునర్విచారణకు తెప్పించి తనపక్షముగా తీర్పుచెప్పించుకొనెను. తరువాత తంజావూరుకు ఆంగ్లేయప్రతినిధిని (రెసిడెంటును) నియమించుటలో బెన్‌ఫీల్డుకు అనుకూలముగానుండు వానిని నియమించుటకు కౌన్సిల్ వారు సలహానిచ్చిరి. గవర్నరు పిగట్టు అందుకు అంగీకరింపక యింకొకనిని నియమించెను. అంతట కౌన్సిలువారును బెన్‌ఫీల్డ్‌ను కుట్రచేసి 1776 సంవత్సరం ఆగస్టు 24 వ తేదీన పిగట్టును చెరబెట్టి బంధించిరి! ఈ సంగతి సీమకు తెలియగా డైరెక్టర్లు దిగ్భ్రమజెందిరి. కాని వారిలోనే