పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరల వడ్డీ వ్యాపారము

183


బాకీదారులలో బలవంతులైన దొరలుండిరి. కవున్సిలు సభ్యులకుకూడా లంచములిచ్చి వారినోళ్లు కట్టివేసిరి. కంపెనీ డైరెక్టరులకుగూడ నీ బాకీలవ్యాపారములో భాగమున్నట్లు తేలినది. వీరందరు కలిసి పార్ల మెంటులో స్థానములు సంపాదించి తమ పలుకుబడిని వినియోగించి త్రోసివేసిన బాకీలను గూడా మరల అమలులోనికి తెచ్చి భారతదేశ ఆదాయమునుండి కొన్ని కోట్ల రూపాయిలు అపహరించిరి. దీనిని గూర్చి 1840 లోనే తారంటంన్ తన చరిత్రలో వ్రాసియున్నాడు. (Thornton's History of British Empire in India Vol. VI. Pages 1-17)

II

ఆర్కాటునవాబు బాకీలు.

మొదటిరోజులలో కంపెనీయుద్యోగులు స్వంతవ్యాపారము చేయుటయేకాక తా మన్యాయముగా నార్జించిన ధనమును దేశములోని నవాబులకు రాజులకు అప్పులిచ్చుచుండిరి. తమ పలుకుబడిని వినియోగించి దొంగపత్రములు వ్రాయించుకొనుచు అత్యధికమైన సాలుసరి కాంపౌండు వడ్డీలు పుచ్చుకొనుచుండిరి. ఆ రోజులలో ప్రతిరాజధానిని పరిపాలించుటకు గనర్నరుకు 'కౌన్సిల్ ' అను సలహా సంఘముండెను. ఈ కౌన్సిలులోని బహుసంఖ్యాకుల అభిప్రాయానుసారము అన్ని వ్యవహారములును జరుగవలెను. అందువలన కౌన్సిలు మెంబర్లకు లంచములిచ్చి అనేకు లీ వ్యాపారమున లాభములు పొందుచుండిరి. ఇట్టి యుదాహరణము లనేకములు కలవు. 1763లో బెన్‌ఫీల్డు అను ఆంగ్లేయుడు మద్రాసులో కంపెనీవారి కొలువులో ఇంజ