పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


పాయములుపన్ని ఈ రాజులను నవాబులను పీడించి లంచపంచములు కొల్లగాగొనుచుండిరి. ఈ నవాబుల చుట్టును రాజుల చుట్టును జేరిన ఆంగ్లేయ తార్పుడుగాండ్రును దుర్మార్గులును వీరిని వంచించి దుర్వ్యసనములలోదింపి ధనమపహరించుచుండిరి. సామాన్యదర్బారు ఖర్చులకు పరివారమునకు వేశ్యలకు వ్యభిచారమునకు సురాపానమునకు ధనము కావలసియుండెను. ప్రజా పీడనము వలన దుష్పరిపాలనమువలన నెంత ధనము, సంగ్రహించినను గూడ సొమ్ముచాలక ఈ రాజులు నవాబులు బాధలు పడుచుండిరి.

నేటివులును దొరలునుకూడ వీరికి అప్పులిచ్చుట యొక వ్యాపారముగా సాగించిరి. అవసరమునుబట్టియు అధికారమును బట్టియు ప్రతిఫలరహితముగాను గూడనూటికి 24 మొదలు 48 వంతులవరకు సాలుసరి కాంపౌండువడ్డీలతో నీ దొరలు అధికారులు నేటివులు ఋణపత్రములు వ్రాయించుకొనసాగిరి. ఈ ఋణపత్రములనుబట్టి బాకీదారు లీ నవాబులను ఒత్తిడిచేయుట, జాగీరులు వ్రాయించుకొనుట, రివిన్యూ తాకట్టు వ్రాయించుకొనుటయుకూడ కలదు. ఆర్కాటునవాబు రాజ్యములోను తంజావూరులోను అయోధ్యలోను ఇట్టి వ్యాపారము చేయు దొరల సంఖ్య మితిమీరెను. ఆర్కాటు నవాబు బాకీల విషయమునవలె నిజమైన విచారణ జరిగిన సందర్భములలో నీ బాకీలలో చాలవరకు అబద్దములని తేలినవి. చాల పద్దులను గవర్నరు గవర్నరుజనరలుల కవున్సిళ్ళు అబద్దములని తోసివేసెను గాని పోగా మిగిలినవే యత్యధికముగానుండెను.